అక్షరటుడే, భీమ్గల్ (వేల్పూర్): Guru Bhakti Shramadan | ఆశ్రమ పొలంలో భక్తులు శ్రమదానంతో వరినాట్లు వేసి తమ గురుభక్తిని చాటుకున్నారు. మండల పరిధిలోని వేల్పూర్ (Velpur) గోవింద గిరి స్వామి (Govinda Giri Swami) దివ్య యోగాశ్రమానికి సంబంధించి సీతారాంపల్లెలోని పొలంలో సోమవారం వెంకటాపూర్ వేంకటేశ్వర సేవా సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
Guru Bhakti Shramadan | ఉత్సాహంగా వరినాట్లు..
స్వామివారి శిష్యులు, భక్తులు తమ పనులను పక్కనపెట్టి వ్యవసాయక్షేత్రంలో ఉత్సాహంగా వరి నాట్లు వేశారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మికవేత్త రాఘవేంద్ర స్వామి మాట్లాడుతూ.. కష్టాన్ని శ్రమ అనుకోకుండా సేవ రూపంలో వరి నాట్లు వేయడం గొప్ప విషయమన్నారు. సేవా భావంతో మెలిగే భక్తులపై గోవింద గిరి స్వామి, జగన్మాత ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. అనంతరం నాట్లు వేసిన భక్తులకు జ్ఞాపికలను అందజేసి, లడ్డూ ప్రసాదాన్ని వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో మెండె పద్మిని-మహేందర్ దంపతులు, కుంట సువర్ణ, వెంకటాపూర్ మల్లవ్వ, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: తెలంగాణ హైకోర్టు సంచలన ఆదేశాలు