Lokayukta Inquiry | బోధన్ శ్మశానవాటిక నిధుల రగడపై ‘లోకాయుక్త’ విచారణ

బోధన్ మున్సిపాలిటీలో నిధుల దుర్వినియోగంపై లోకాయుక్త విచారణ చేపట్టింది.

shashi kiran Mottala

అక్షరటుడే, బోధన్​: Lokayukta Inquiry | బోధన్(Bodhan) మున్సిపాలిటీ 16వ వార్డు ఎస్సీ శ్మశానవాటిక అభివృద్ధి నిధుల దుర్వినియోగంపై కొన్నాళ్లుగా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో బుధవారం ‘లోకాయుక్త’ సభ్యులు బోధన్​ పట్టణాన్ని సందర్శాంచారు.

Lokayukta Inquiry | క్షేత్రస్థాయిలో పరిశీలన

లోకాయుక్త కమిషనర్ జైపాల్, అధికారుల బృందం క్షేత్రస్థాయి పరిశీలన జరిపింది. 2018లో ప్రహరీ నిర్మాణంలో రూ.7.80 లక్షలు, 2023లో ‘పట్టణ ప్రగతి’ కింద టాయిలెట్ల కోసం కేటాయించిన రూ.4.43 లక్షలు పనులు చేయకుండానే మున్సిపల్​ నిధులు (Municipal Funds) కాజేశారని మాజీ కౌన్సిలర్ టి.రాజవిఠల్ లోకాయుక్తను ఆశ్రయించారు. ఆయన ఫిర్యాదుపై లోకాయుక్త క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టింది. గతంలో మున్సిపల్ రీజినల్ డైరెక్టర్ కూడా ఇదే అంశంపై విచారణ చేపట్టారు. లోకాయుక్త కమిషనర్​తో పాటు బోధన్ మున్సిపల్ ఛైర్​పర్సన్​ తూము పద్మ, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: ట్రంప్‌పై మరో హత్యాయత్నం..? పిస్టల్​తో పట్టుబడ్డ వ్యక్తి 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
3 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *