అక్షరటుడే, కామారెడ్డి: Online Betting Arrest | ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాలోని మరొక సభ్యుడిని కామారెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) బుధవారం మీడియాకు వివరాలు వెల్లడించారు.
Online Betting Arrest | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని..
గత నెల 31న కామారెడ్డి పోలీస్ స్టేషన్‌లో ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ మోసం కేసు నమోదైంది. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయగా, ప్రధాన నిందితుడి కోసం ప్రత్యేక పోలీసు బృందాలు ముమ్మరంగా గాలించాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లి జిల్లా వీడూరుకొండ మండలం వెల్లితూర్తి గ్రామానికి చెందిన ముత్యాల నాయుడు అలియాస్ రుంగాలి ముత్యాల నాయుడును అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు సాట్స్పోర్ట్స్ (SAT Sports), http://Future9.com పేర్లతో ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ వెబ్‌సైట్లను నిర్వహిస్తున్నట్లు తేలింది.
ప్రజలకు వాట్సాప్ లింకులు పంపి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మించి యూపీఐ, బ్యాంకు ఖాతాలు, క్యూఆర్ కోడ్‌ల ద్వారా డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి వద్ద నుంచి ఒక ఐఫోన్ మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకోగా అందులో సాట్స్పోర్ట్స్, http://Future9.comకు సంబంధించిన కీలక డిజిటల్ ఆధారాలు లభించాయి. ఈ కేసులో మిగిలిన నిందితులు, వారి బ్యాంకు ఖాతాలు, ఆర్థిక లావాదేవీలు, డిజిటల్ పరికరాలపై దర్యాప్తు కొనసాగుతోందని, త్వరలోనే వారిని కూడా అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి..: Nizamsagar Inflow | నిజాంసాగర్‌కు పెరుగుతున్న వరద.. ఆశాజనకంగా నీటిమట్టం