Illegal Liquor Seizure | అక్రమంగా నిల్వ ఉంచిన విదేశీ, డిఫెన్స్​ మద్యం స్వాధీనం

నగరంలో అక్రమంగా నిలువ ఉంచిన విదేశీ, డిఫెన్స్​ మద్యంను ఎక్సైజ్​ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​క్రైం: Illegal Liquor Seizure | నగరం (Nizamabad)లో అక్రమంగా నిల్వ ఉంచిన విదేశీ, డిఫెన్స్​ మద్యాన్ని ఎక్సైజ్​ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఎక్సైజ్​ శాఖ అసిస్టెంట్​ కమిషనర్​ అరుణ్​కుమార్​ వివరాలు వెల్లడించారు.

Illegal Liquor Seizure | న్యాల్​కల్​, ముబారక్​నగర్​లో..

నగరంలోని న్యాల్​కల్​, ముబాకర్​నగర్​లో ఇద్దరు వ్యక్తుల వద్ద విదేశీ, డిఫెన్స్​ మద్యం అక్రమంగా నిలువ ఉన్నట్లు అందిన సమాచారం మేరకు ఎక్సైజ్​ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈక్రమంలో మూడ భాస్కర్​, కంఠాల గంగారత్నం ఇళ్లలో 110బాటిళ్ల మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ బాటిళ్లను వారు విదేశాల నుండి వచ్చిన వారి నుండి కొనుగోలు చేశారని.. అలాగే ఇతర మార్గాల ద్వారా డిఫెన్స్ మద్యం తక్కువ ధరకు కొనుగోలు చేశారన్నారు. ఈ దాడుల్లో ఎక్సైజ్​ ఎస్​హెచ్​వో సరిత, సిబ్బంది నజీర్ హుస్సేన్​, గజేందర్​, వి. రవి తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Jukkal Bathukamma Celebrations | జుక్కల్‌లో బతుకమ్మ సంబరాలు.. విజేతలకు బహుమతులు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *