Sriramsagar Project Flood | శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు తగ్గిన వరద

శ్రీరాంసాగర్ (పోచంపాడ్) ప్రాజెక్టుకు వరద నీరు కొనసాగుతోంది.

shashi kiran Mottala

అక్షరటుడే, మెండోరా: Sriramsagar Project Flood | మండలంలోని శ్రీరాంసాగర్ (పోచంపాడ్) ప్రాజెక్టుకు వరద నీరు కొనసాగుతోంది. అయితే శుక్రవారం కంటే శనివారం ప్రాజెక్టుకు వరద తగ్గింది.

Sriramsagar Project Flood | 12,274 క్యూసెక్కుల ఇన్​ఫ్లో

ప్రస్తుతం ప్రాజెక్టులోకి 12,274 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (Sriramsagar Project) పూర్తి నీటిమట్టం 1,091 అడుగులు, పూర్తి సామర్థ్యం 80.50 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 1,078.20 అడుగుల వద్ద 40.304 టీఎంసీల నీటి నిల్వ ఉంది.  గత ఏడాది ఇదే సమయానికి కూడా ప్రాజెక్టులో 1,078.20 అడుగుల వద్ద 40.305 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టు నుంచి కాకతీయ కాలువ ద్వారా 300 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 462 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు కలిపి మొత్తం 993 క్యూసెక్కుల ఔట్​ ఫ్లో నమోదు అవుతోంది.

Sriramsagar Project Flood

ఇది కూడా చదవండి..: కామారెడ్డిలోని ప్రధాన రోడ్డుపై వర్షం నీళ్లలో కూర్చుని బీఆర్​ఎస్​ నాయకుడు నిరసన వ్యక్తం చేశారు.

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *