అక్షరటుడే, వెబ్డెస్క్: Hyderabad Fire Accident | హైదరాబాద్ (Hyderabad)లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బంజారా హిల్స్ రోడ్ నంబర్11లోని బీఆర్కే న్యూస్ భవనం సెల్లార్‌లో మంటలు చెలరేగాయి.
సెల్లార్‌లో ఉన్న దారువాలా వైన్ మార్ట్ స్టాక్ స్టోరేజీలో శనివారం ఉదయం ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. అనంతరం అవి వేగంగా వ్యాపించాయి. దీంతో పొగలు రావడంతో గమనించిన స్థానికులు వెంటనే అగ్ని మాపక సిబ్బంది సమాచారం అందించారు.
Hyderabad Fire Accident | అగ్నికి ఆహుతైన మద్యం
ఘటనా స్థలానికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది మూడు ఫైరింజన్లతో మంటలను ఆర్పివేశారు. భవనంలో చిక్కుకున్న 11 మందిని కాపాడారు. ఈ ప్రమాదంలో భారీగా మద్యం అగ్నికి ఆహుతి అయింది. దీంతో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి..: HYDRAA Jobs | ఉద్యోగం కోసం వచ్చిన యువత.. సరూర్ నగర్ స్టేడియం వద్ద తోపులాట