HYDRAA Jobs | ఉద్యోగం కోసం వచ్చిన యువత.. సరూర్ నగర్ స్టేడియం వద్ద తోపులాట

హైడ్రాలో ఉద్యోగాల కోసం నిరుద్యోగులు భారీ ఎత్తున తరలి వచ్చారు. దీంతో సరూర్​ నగర్​ స్టేడియంలో శనివారం తోపూలాట చోటు చేసుకుంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HYDRAA Jobs | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలోని సరూర్​ నగర్​ స్టేడియంలో శనివారం తోపూలాట చోటు చేసుకుంది. హైడ్రాలో ఉద్యోగాల కోసం నిరుద్యోగులు భారీ ఎత్తున తరలి వచ్చారు.

హైడ్రాలో ఒప్పంద ప్రతిపాదికన పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్​ విడుదల అయింది. 100 డీఆర్​ఎఫ్​ అసిస్టెంట్లు, 50 డ్రైవర్​ పోస్టులు భర్తీ చేస్తామని అధికారులు తెలిపారు. ఎలాంటి రాత పరీక్ష లేకుండా.. ఫిజికల్​ టెస్టుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తామన్నారు. ఈ నెల 8, 9 తేదీల్లో ఉదయం 5 గంటల నుంచి సరూర్​ నగర్​ స్టేడియంలో ఈవెంట్స్​ నిర్వహిస్తామని ప్రకటించారు.

HYDRAA Jobs | పోటెత్తిన నిరుద్యోగులు

హైడ్రాలో ఉద్యోగాల కోసం శనివారం ఉదయం నుంచే నిరుద్యోగులు పోటెత్తారు. సంబంధిత సర్టిఫికెట్లతో స్టేడియానికి వచ్చారు. ఈవెంట్స్​లో భాగంగా 170 సెకన్లలో 800 మీటర్ల రన్నింగ్, 15 సెకన్లలో 100 మీటర్లు, లాంగ్ జంప్ 4 మీటర్లు, 6 మీటర్ల షాట్‌పుట్ (7.2 KG) ఈవెంట్లలో క్వాలిఫై అవ్వాలని హైడ్రా ప్రకటించింది. దీంతో ఈవెంట్స్‌లో పాల్గొనేందుకు భారీగా నిరుద్యోగులు రావడంతో ఉద్రిక్తత నెలకొంది. ఇంత మంది వస్తే ఈవెంట్స్​ ఎలా నిర్వహిస్తామని అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు నిరుద్యోగులు ఒకరినొకరు తోసుకోవడంతో అక్కడ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. దీంతో పోలీసులు స్వల్ప లాఠీఛార్జీ చేశారు. టోకెన్లు ఉన్నవాళ్ళు ఉండాలని సూచించారు.

 

దీనిని కూడా చదవండి : Kondapalli Ganesh Fraud | గణేష్ లడ్డూ పంచాడు.. పరిచయాలు పెంచుకున్నాడు.. కోట్లకు టోకరా వేశాడు.. సోషల్ మీడియాలో ప్రచారం వైరల్

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *