అక్షరటుడే వెబ్‌డెస్క్: HCU Drug Raid | హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU)లో తెలంగాణ ఈగల్ (EAGLE) టీమ్ , పోలీసులు బుధవారం ఉయుక్తంగా ఆకస్మిక దాడులు నిర్వహించారు. క్యాంపస్‌లో డ్రగ్స్ సేవించడం, విక్రయాలు జరుగుతున్నాయన్న పక్కా సమాచారంతో అధికారులు ఈ తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానిత విద్యార్థులకు డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా, ఏకంగా 17 మంది విద్యార్థులకు గంజాయి పాజిటివ్ (Cannabis positive) వచ్చినట్లు తేలడం వర్సిటీలో కలకలం రేపింది.
HCU Drug Raid | అస్సాం నుంచి సరఫరా..
యూనివర్సిటీ పరిధిలో అక్రమంగా మత్తుపదార్థాలు సరఫరా చేస్తున్న ఒక ప్రధాన డ్రగ్ పెడ్లర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు అస్సాం రాష్ట్రం నుంచి గంజాయిని తీసుకువచ్చి హెచ్యూవీ విద్యార్థులకు విక్రయిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో గుర్తించారు. క్యాంపస్‌లో ఒక్కో గ్రాము గంజాయిని రూ.500 చొప్పున అమ్ముతున్నట్లు తేలింది. ప్రస్తుతం వర్సిటీ ప్రాంగణంలో ఈగల్ టీమ్ తనిఖీలు కొనసాగుతుండగా, ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత తెలియనున్నాయి.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఈగల్ టీమ్ దాడులు..
17 మంది HCU విద్యార్థులకు గంజాయి పాజిటివ్ .. డ్రగ్ పెడ్లర్ ను అదుపులోకి తీసుకున్న ఈగల్ టీమ్..#Hyderabad pic.twitter.com/lYzw0AuwZ2
— Telugu Stride (@TeluguStride) August 12, 2026
ఇది కూడా చదవండి: Mumbai Landslide | ముంబైలో విరిగిపడిన కొండచరియలు.. ఇద్దరు దుర్మరణం..