Fee Reimbursement | ఫీజుల వసూళ్లలో ఉన్న శ్రద్ధ.. విద్యా ప్రమాణాల్లోనూ చూపాలి: విజయశాంతి

హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలపై ఎమ్మెల్సీ విజయశాంతి కీలక వ్యాఖ్యలు చేశారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Fee Reimbursement | హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలపై ఎమ్మెల్సీ విజయశాంతి ( Vijaya Shanthi )కీలక వ్యాఖ్యలు చేశారు. ఫీజు రియింబర్స్‌మెంట్ బకాయిల విడుదలకు సంబంధించి కోర్టు ఆదేశాలను గౌరవిస్తూనే, విద్యార్థుల ప్రయోజనాల కోసం కఠిన నిబంధనలు అమలు చేయాలని ఆమె ప్రభుత్వానికి సూచించారు.

Fee Reimbursement | యాజమాన్యాల బాధ్యత..

విద్యార్థుల నుంచి ఫీజులు తీసుకోవడంలో తప్పు లేదు, కానీ అందుకు తగ్గట్టుగా నాణ్యమైన విద్యను , సరైన వసతులను కల్పించాల్సిన బాధ్యత యాజమాన్యాలపైనే ఉందని విజయశాంతి స్పష్టం చేశారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని ఆమె పేర్కొన్నారు.

vijayashanthi.1

Fee Reimbursement | విజిలెన్స్ నివేదిక ..

చాలా ప్రైవేట్ కాలేజీలు ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను పాటించడం లేదని, కనీస సదుపాయాలు కూడా కల్పించడం లేదని విజిలెన్స్ కమిషన్ విచారణలో వెల్లడైందని ఆమె గుర్తుచేశారు. ఈ మేరకు విజిలెన్స్ కమిషన్ ప్రభుత్వానికి నివేదికను కూడా సమర్పించిందని ఆమె తెలిపారు.

Fee Reimbursement | ప్రభుత్వానికి కీలక విజ్ఞప్తి..

ఫీజు రియింబర్స్‌మెంట్ పేరుతో ప్రభుత్వం చెల్లిస్తున్న ప్రజాధనానికి న్యాయం జరగాలని ఆమె కోరారు. నీస ప్రమాణాలు లేని కాలేజీలపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ విషయాన్ని తాను గతంలో శాసనమండలి సమావేశాల్లో కూడా ప్రస్తావించానని తెలిపారు. తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, నాణ్యమైన విద్యను అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

ఇది కూడా చదవండి:  Vi Spotify Partnership | వీఐ కస్టమర్లకు బంపర్ ఆఫర్..స్పాటిఫై ప్రీమియం ఇక ఉచితం

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *