అక్షరటుడే, కామారెడ్డి : Councillor Protest | పట్టణంలోని ప్రధాన రోడ్డుపై వర్షం నీళ్లలో కూర్చుని బీఆర్ఎస్ (BRS) నాయకుడు నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటన శనివారం ఉదయం చోటు చేసుకుంది.
Councillor Protest |కామారెడ్డి–కరీంనగర్ ప్రధాన రహదారిపై…
కామారెడ్డి–కరీంనగర్ ప్రధాన రహదారిపై పోలీస్ స్టేషన్ ముందు రైల్వే బ్రిడ్జి దిగే సమయంలో కుంటను తలపించేలా రోడ్డుపై నీళ్లు నిలిచి ఉన్నాయని.. నిత్యం ఇదే దారిలో తిరిగే ప్రజాప్రతినిధులు, అధికారులు కన్నెత్తి చూడడం లేదని బీఆర్ఎస్ 47వ వార్డు కౌన్సిలర్ గెరిగంటి లక్ష్మీనారాయణ వాపోయారు. పట్టణంలోని రైల్వే కమాన్ మీదుగా పాత బస్టాండ్ వెళ్లే దారిలో కమాన్ కింద వర్షం పడితే నీరు భారీగా నిలిచిపోతుందన్నారు. అధికారులు పరిష్కార మార్గం చూపడంలో విఫలం అవుతున్నారని.. నీటి నిల్వతో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతూ ప్రమాదాలు జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Councillor Protest |దీక్ష చేపడుతా
అధికారులు స్పందించకపోవడంతో భారీగా రోడ్డుపై నిలిచిపోయిన నీటిలో కూర్చుని నిరసన తెలుపుతున్నానన్నారు. అధికారులు స్పందించి పరిష్కార మార్గం చూపాలని డిమాండ్ చేశారు. ఆస్పత్రికి వచ్చే రోగులు, ఇతర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా, ప్రమాదాలు సంభవిస్తున్నా అధికారులు పట్టించుకోరా అని నిలదీశారు. నీరు నిల్వకుండా పరిష్కారం చూపకపోతే అక్కడే నిరసన దీక్ష చేపడతానని హెచ్చరించారు.
దీనిని కూడా చదవండి : Russia Sanctions Bill | రష్యాపై ఆంక్షల బిల్లుకు అమెరికా ఆమోదం.. భారత్‌పై ప్రభావం