అక్షరటుడే, ఆర్మూర్: Armoor Urban Park | నిజామాబాద్ జిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న ఆర్మూర్(Armoor) అరణ్య అర్బన్ పార్క్ ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. రాష్ట్రస్థాయి వనమహోత్సవాల్లో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) గురువారం వర్చువల్‌గా ఈ పార్క్‌ను ప్రారంభించనున్నారు.
Armoor Urban Park | మానిక్ భండార్ వద్ద ఏకో పార్క్..
వనమహోత్సవ వేడుకల్లో భాగంగా మానిక్‌బండార్, మామిడిపల్లి-3, చిన్నాపూర్-2 రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో అటవీ శాఖ ఈ అరణ్యాన్ని అభివృద్ధి చేసింది. 166.411 హెక్టార్లలో (476.30 ఎకరాలు) నిజామాబాద్ పట్టణానికి ఆనుకుని, ఎన్‌హెచ్-63 పక్కనే ఈ పార్క్ ఏర్పాటైంది. నగర శివార్లలో ఉండటం, అలాగే దీని చుట్టుపక్కల పాఠశాలలు, కళాశాలలు, సాంకేతిక విద్యా సంస్థలతో సహా అనేక విద్యాసంస్థలు ఉండటంతో ఈ పార్క్ డెవలప్మెంట్కు ఉపయోగపడనుంది.
Armoor Urban Park | సుమారు రూ.5కోట్ల వ్యయం
అఫారెస్టేషన్, కాంపా(CAMPA), నుడా (NUDA), ఎన్ఎంసీ-(NMC) కింద సుమారు రూ.5 కోట్లతో దీనిని అభివృద్ధి చేశారు. విశాలమైన ప్రవేశ ద్వారం (Grand Entrance, Arch), గ్రావెల్ వాకింగ్ ట్రాక్‌లు, ఓపెన్ జిమ్, పిల్లల సాహస క్రీడల స్థలం (Children Adventure Area), వాచ్ టవర్, టికెట్ కౌంటర్, సెక్యూరిటీ రూమ్, శౌచాలయాల సముదాయం, రచ్చబండలు (4), అందంగా తీర్చిదిద్దిన సందర్శకుల ప్రాంతాలు ఉన్నాయి.
Armoor Urban Park | అటవీ సంరక్షణకు ప్రత్యేక చర్యలు
అర్బన్ పార్క్ మొత్తం 5.60 కి.మీ.లో విస్తీర్ణంలో ఉంది. అలాగే 4,411 మీటర్ల పొడవునా చైన్ లింక్ ఫెన్సింగ్ (ఇనుప జాలీ కాంపౌండ్) నిర్మించారు. 164 మీటర్ల రక్షణ గోడ (Compound Wall) కూడా పూర్తి చేశారు. రిజర్వ్ ఫారెస్ట్‌ను ఆక్రమణల నుండి పట్టణీకరణ ఒత్తిళ్ల నుండి కాపాడటానికి తగిన రక్షణ చర్యలు చేపట్టారు.
Armoor Urban Park | ప్రాజెక్టు ప్రాముఖ్యత
నిజామాబాద్ పట్టణానికి ఒక ప్రధానమైన పచ్చని శ్వాసకోశ ప్రాంతం (Green Lung Space) లాంటి పర్యావరణ క్షేత్రం ఏర్పటే ప్రధాన లక్ష్యంగా ఈ పార్క్‌ను నెలకొల్పారు. వేగంగా పట్టణీకరణ చెందుతున్న నేటి కాలంలో 476.30 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్‌ను సంరక్షించడం కాపాడటం కత్తిమీద సామే అయినప్పటికీ అటవీశాఖ ఈ స్థలాన్ని సంరక్షించే బాధ్యత తీసుకుంది. ఎకో-టూరిజం, పర్యావరణ అవగాహన, వినోదం, ఆరోగ్యకరమైన కార్యకలాపాలను పెంపొందించేందుకు కృషి చేయనుంది.

ఇది కూడా చదవండి : Rahul Gandhi NEET | పేపర్ లీకేజీని ఆపలేక యాప్‌లపై నిషేధమా?: రాహుల్ గాంధీ