Rakhi Festival | ఆత్మీయత అనురాగానికి ప్రతీక.. రాఖీ పండుగ

రాఖీ పండుగను ఉమ్మడి జిల్లాలో ఘనంగా జరుపుకున్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, బాన్సువాడ: Rakhi Festival | రాఖీ పండుగ (Raksha Bandhan) తోబుట్టువుల అనుబంధానికి ప్రతీక.. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలను ఇనుమడింపేజేసే ఈ పండుగను ఉమ్మడిజిల్లాలో ఘనంగా నిర్వహించుకున్నారు.

Rakhi Festival | ఆత్మీయ రక్ష..

రాఖీ పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్​రెడ్డి (MLA Pocharam Srinivas Reddy) ఆయన అక్క దొడ్ల సత్యవతి రాఖీ కట్టి ఆశీర్వదించారు. బాన్సువాడలోని తన నివాసంలో అన్నా–చెల్లెళ్ల అనుబంధానికి, అక్కా–తమ్ముళ్ల ఆప్యాయతకు ప్రతీకగా రక్షాబంధన్ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.. రాఖీ పండుగ ప్రేమ, ఆప్యాయత, నమ్మకం, ఆత్మీయతలకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. అక్కా–తమ్ముళ్ల అనుబంధం, అన్నా–చెల్లెళ్ల ఆత్మీయత ఎల్లప్పుడూ ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. రాఖీ పౌర్ణమిని ప్రతి ఒక్కరూ ఆనందంగా, ఘనంగా జరుపుకోవాలని కోరుతూ రాష్ట్ర ప్రజలందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.

Rakhi Festival | ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావుకు..

రక్షాబంధన్ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంప్​ కార్యాలయంలో బ్రహ్మకుమారి స్వప్న ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావుకు రాఖీ కట్టారు. ఈ సందర్భంగా క్యాంప్​ కార్యాలయంలో సందడిగా మారింది. బీడీ కార్మికులు, మహిళా సంఘాల సభ్యులు, మహిళలు, చిన్నారులు సైతం ఎమ్మెల్యేకు రాఖీకట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారందరికీ ఆత్మీయంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అన్నాచెల్లెళ్ల అనుబంధం, ప్రేమ, ఆప్యాయతలు ఎల్లప్పుడూ ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు.

ఇది కూడా చదవండి: సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన కొండా సురేఖ.. 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *