అక్షరటుడే వెబ్‌డెస్క్: Annamalai Film Remarks | భారతీయ చలనచిత్ర పరిశ్రమలో విపరీతమైన హింస, మహిళలను తప్పుగా ప్రదర్శించే ధోరణి పెరిగిపోతుండటంపై తమిళనాడుకు చెందిన రాజకీయ నాయకుడు, మాజీ ఐపీఎస్ అన్నామలై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కోయంబత్తూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) పనితీరుపై మండిపడ్డారు.
Annamalai Film Remarks | అన్నామలై డిమాండ్..
ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినప్పటికీ సెన్సార్ బోర్డు నిష్పాక్షికంగా వ్యవహరించాలని, నటుల ఇమేజ్ లేదా ప్రజాదరణను చూసి ఎటువంటి సడలింపులు ఇవ్వకూడదని అన్నామలై డిమాండ్ చేశారు. గ్రాఫిక్ వయొలెన్స్, మహిళలను కించపరిచేలా ఉండే సన్నివేశాలపై మరింత కఠినంగా ఉండాలని కోరారు. ‘ఏ’ (Adults Only) సర్టిఫికేట్ పొందిన చిత్రాలకు చిన్నపిల్లలను థియేటర్లలోకి అనుమతించకుండా సింగిల్ స్క్రీన్ యాజమాన్యాలు కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. రక్తపాతం, హింసాత్మక దృశ్యాలు చిన్నపిల్లల మనస్తత్వంపై తీవ్ర దుష్ప్రభావం చూపుతాయని హెచ్చరించారు.
Annamalai Film Remarks | బాధ్యతాయుతంగా వ్యవహరించాలి..
తానేమీ సినిమాలను బ్యాన్ చేయాలని కోరడం లేదని స్పష్టం చేసిన అన్నామలై.. సినిమాకు సమాజాన్ని ప్రభావితం చేసే శక్తి ఉందని తెలిపారు. దీన్ని గుర్తించి నిర్మాతలు, దర్శకులు మరింత బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని హితవు పలికారు.
ఇది కూడా చదవండి: Rakhi Festival | ఆత్మీయత అనురాగానికి ప్రతీక.. రాఖీ పండుగ