Kuwait Airport Attack | కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై బుధవారం ఇరాన్ ( Iran ) జరిపిన ఘోర డ్రోన్ దాడిలో ఒక భారతీయుడు మరణించాడు. ఈ విషయాన్ని కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం (ఎంబసీ) అధికారికంగా ధృవీకరించింది. మరణించిన వ్యక్తి ఏ రాష్ట్రానికి చెందినవాడనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. బాధిత కుటుంబంతో మాట్లాడుతున్నామని, వారికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని ఎంబసీ పేర్కొంది. కాగా, ఈ డ్రోన్ దాడి వల్ల విమానాశ్రయంలోని ప్రయాణికులు, సిబ్బందితో కలిపి మొత్తం 63 మంది తీవ్రంగా గాయపడ్డారు.

Kuwait Airport Attack | అమెరికా దాడులకు ప్రతీకారంగానే ఇరాన్ దాడి..
ఇరాన్‌లోని గెరుక్, ఖేష్మ్ ద్వీపాలపై ఇటీవల అమెరికా జరిపిన వైమానిక దాడులకు ప్రతీకారంగానే ఇరాన్ ఈ దాడులకు తెగబడింది. కువైట్‌తో పాటు బహ్రెయిన్‌లోని పలు కీలక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ విరుచుకుపడింది. ఈ క్రమంలోనే కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై కూడా దాడి జరగడంతో ఎయిర్‌పోర్ట్ టెర్మినల్స్ తీవ్రంగా దెబ్బతిన్నాయని కువైట్ జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ వెల్లడించింది.

Kuwait Airport Attack | విమాన సర్వీసులు రద్దు..
దాడి నేపథ్యంలో కువైట్ ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) విధించారు. విమానాల రాకపోకలను పూర్తిగా నిలిపివేసి, కువైట్ రావాల్సిన పలు అంతర్జాతీయ సర్వీసులను పక్క దేశాలకు లేదా ఇతర సురక్షిత ప్రాంతాలకు మళ్లించారు. ఈ ఉద్రిక్త పరిస్థితుల కారణంగా భారతీయ విమానయాన సంస్థ ‘ఇండిగో’ సైతం అప్రమత్తమైంది. గురువారం వరకు కువైట్‌కు నడిచే తమ అన్ని సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఇండిగో యాజమాన్యం ప్రకటించింది.
ఇది కూడా చదవండి: TMC Rebel MLA | మమత బెనర్జీకి షాక్.. ప్రతిపక్ష నేతగా టీఎంసీ రెబల్ ఎమ్మెల్యే
