India Hockey Jersey | భారత హాకీ జట్టు జెర్సీ రంగు మార్పు .. ఇది చరిత్ర మార్చే కుట్రే అంటూ ప్రియాంకా గాంధీ ఫైర్

భారత హాకీ జట్టు కొత్త జెర్సీ రంగు మార్పుపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: India Hockey Jersey | భారత హాకీ జట్టు కొత్త జెర్సీ రంగు మార్పుపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ వెలుపల మీడియాతో మాట్లాడిన ఆమె.. జెర్సీ రంగులను మార్చడం, విద్యా విధానం ద్వారా చరిత్రను తిరగరాయాలని చూడటం కేవలం చరిత్రను మార్చే కుట్రేనని విమర్శించారు. ఇలాంటి ప్రయత్నాల ద్వారా దేశ మూలాలను ఎప్పటికీ మార్చలేరని స్పష్టం చేశారు. భారత స్వాతంత్ర్య సంగ్రామం అహింస, సత్యం, సోదరభావం అనే పవిత్ర పునాదులపై నిర్మితమైందని, ఆ పోరాటంలో ఆర్‌ఎస్‌ఎస్ పాత్ర ఏమీ లేదని ప్రియాంకా గాంధీ పేర్కొన్నారు. దేశ ప్రజల నిజమైన గుర్తింపును, వారి ప్రేమాభిమానాలను ఎవరూ వేరు చేయలేరని ఆమె తేల్చిచెప్పారు.

India Hockey Jersey | వీరేన్ రస్కిన్హా అసంతృప్తి..

అంతకుముందు, భారత పురుషుల, మహిళల సీనియర్ హాకీ జట్ల కోసం అధికారులు కొత్త కాషాయ రంగు జెర్సీలను ఆవిష్కరించారు. అయితే, హాకీ ఇండియా తీసుకున్న ఈ నిర్ణయంపై మాజీ ఒలింపియన్, భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ వీరేన్ రస్కిన్హా కూడా తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కారు. దశాబ్దాలుగా భారత హాకీ జట్టు గుర్తింపు , చరిత్ర అన్నీ నీలం రంగు జెర్సీతోనే ముడిపడి ఉన్నాయని సోషల్ మీడియా (ఎక్స్) వేదికగా ఆయన గుర్తుచేశారు. తాను ఎంతో గర్వంగా ఆ నీలిరంగు జెర్సీని ధరించి ఆడామని తెలిపారు. క్రీడాభిమానులు సైతం భారత జట్టును నీలిరంగు దుస్తుల్లోనే చూడటానికి ఇష్టపడతారని, ఎలాంటి ముందస్తు తర్కం లేకుండా హఠాత్తుగా కాషాయ రంగుకు మారడం వెనుక ఆంతర్యం ఏంటో తనకు అర్థం కావడం లేదని ఆయన ప్రశ్నించారు.

ఇది కూడా చదవండి:  Nampally Court Hearing | ఒకే రోజు వ్యవధిలో… నాంపల్లి కోర్టుకు ఇద్దరు వేర్వేరు పార్టీల అగ్రనేతలు..

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *