Election results | ఉత్కంఠ రేపుతున్న ఐదు రాష్ట్రాల ఫలితాలు.. ఏ స్టేట్​లో ఎవరు ముందంజలో ఉన్నారంటే..

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Election results | దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. పోస్టల్​ బ్యాలెట్​ ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఇందులో మూడు రాష్ట్రాల్లో బీజేపీ ముందంజలో ఉంది. పశ్చిమ బెంగాల్​, అస్సాం రాష్ట్రాల్లో బీజేపీ, పుదుచ్చేరి ఎన్డీయే కూటమి, తమిళనాడులో డీఎంకే కూటమి, కేరళలో యూడీఎఫ్​ కూటమి ముందంజలో ఉన్నాయి. బెంగాల్‌లో 77, తమిళనాడులో 62, కేరళంలో 43, అసోంలో 40, పుదుచ్చేరిలో 6 కౌంటింగ్‌ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతోంది.

Election results | పోస్టల్​ బ్యాలెట్​ ఫలితాలు ఇలా..

బెంగాల్‌లో బీజేపీ అగ్రనేతల ముందంజలో ఉండగా.. నందిగ్రామ్‌లో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి ఆధిక్యంలో ఉన్నారు. భవానీపూర్‌లో సీఎం మమత బెనర్జీ వెనుకంజలో కొనసాగుతున్నారు. ఇక తమిళనాడులో తమిళనాడు పోస్టల్‌ బ్యాలెట్‌లో డీఎంకే, టీవీకే మధ్య హోరాహోరీగా పోరు సాగుతోంది. కొళత్తూరులో సీఎం స్టాలిన్​ ముందంజలో ఉన్నారు. టీవీకే చీఫ్​ విజయ్‌ పెరంబూర్‌లో ఆధిక్యంలో ఉండగా.. తిరుచ్చి ఈస్ట్‌లో విజయ్‌ వెనుకంజలో ఉన్నారు. చెపాక్‌లో డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌ లీడింగ్‌లో కొనసాగుతున్నారు. మైలాపూర్‌లో తమిళిసై వెనుకంజలో ఉన్నారు. ఎడప్పాడిలో ఏఐడీఎంకే అభ్యర్థి పలనీ స్వామి ఆధిక్యంలో ఉన్నారు. అస్సాంలోని జలూక్​పురిలో సీఎం హిమంత బిస్వా శర్మ లీడింగ్​లో ఉన్నారు.

ఇది కూడా చదవండి..: Assembly Election Counting | ఎన్నికల కౌంటింగ్​ ప్రారంభం.. పేరంబదూర్​లో విజయ్​ ముందంజ!

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *