Jantar Mantar Protest | జంతర్‌మంతర్‌ వద్ద సాధారణ పరిస్థితులు..పునరుద్ధరించిన ఇంటర్నెట్ సేవలు

విద్యార్థులు నిరసనలను విరమించి తమ ఇళ్లకు తిరిగి వెళ్తున్నారు. దీంతో జంతర్‌మంతర్‌లో విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Jantar Mantar Protest | ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ పరిసర ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఆందోళనలు విరమించడంతో అక్కడ విధించిన ఆంక్షలను అధికారులు క్రమంగా సడలిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిలిపివేసిన ఇంటర్నెట్ సేవలను కూడా పునరుద్ధరించారు.

Saudi Houthi Attacks | సౌదీ, హౌతీల మధ్య పరస్పర దాడులు..మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత తీవ్రం!

Jantar Mantar Protest | నిశితంగా పరిశీలన

ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులు నిరసనలను విరమించి తమ ఇళ్లకు తిరిగి వెళ్తున్నారు. దీంతో జంతర్‌మంతర్‌లో విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, శాంతిభద్రతల పరిరక్షణకు అవసరమైన చర్యలు కొనసాగిస్తున్నారు.

ప్రస్తుతం జంతర్‌మంతర్‌ ప్రాంతంలో పరిస్థితులు అదుపులో ఉన్నాయని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *