అక్షరటుడే, వెబ్‌డెస్క్: Dubai Shopping Lucky Draw | దుబాయ్‌లో నివాసం ఉంటున్న కేరళకు చెందిన ఆయేషా అమీర్ (27) అనే భారత మహిళను అదృష్టం మామూలుగా తగలలేదు. దుబాయ్ సర్కారు నిర్వహించిన ఓ షాపింగ్ లక్కీ డ్రాలో ఈ యువతి ఒక లగ్జరీ స్టూడియో అపార్ట్‌మెంట్‌ను పూర్తి ఉచితంగా గెలుచుకుంది.
Dubai Shopping Lucky Draw | లగ్జరీ ప్రాపర్టీ డెవలపర్ బింఘట్టి
విన్ యువర్ హోమ్ ఇన్ దుబాయ్ (Win Your Home in Dubai) అనే ఒక సిటీ-వైడ్ షాపింగ్ ప్రమోషన్‌ను దుబాయ్ ఛాంబర్స్, దుబాయ్ ఫెస్టివల్స్ అండ్ రిటైల్ ఎస్టాబ్లిష్‌మెంట్ (DFRE) సంయుక్తంగా నిర్వహించాయి.
ఇందులో ఎవరైనా భాగస్వామ్య అవుట్‌లెట్లలో కనీసం 500 దిర్హామ్‌లు (సుమారు రూ.13,000) విలువైన షాపింగ్ చేయాలి. అనంతరం అక్కడ QR కోడ్‌ను స్కాన్ చేసి బిల్లును అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అలా చేస్తే వారు లక్కీ డ్రాకు అర్హత పొందుతారు. ఈ ప్రమోషన్‌లో లగ్జరీ ప్రాపర్టీ డెవలపర్ బింఘట్టి (Binghatti) ఉచిత అపార్ట్‌మెంట్లను అందజేస్తోంది.
Hyderabad Water Crisis | ఐటీ హబ్‌ల తళతళల వెనుక ‘జల’ సంక్షోభం: భాగ్యనగరంలో పాతాళంలోకి భూగర్భ జలాలు!
Dubai Shopping Lucky Draw | ప్రథమ విజేత…
దుబాయ్‌లో బిజినెస్ కన్సల్టెంట్‌గా ఉన్న ఆయేషా, తన భర్తతో కలిసి సదరు మాల్‌లో షాపింగ్ చేసింది. 500 దిర్హామ్‌ల షాపింగ్ బిల్లుతో లక్కీ డ్రాలో రిజిస్టర్ చేసుకుంది.
ఆ తర్వాత లక్కీ డ్రాలో తొలి వారంలోనే విజేతగా ఆయేషా నిలిచింది. ఈ క్రమంలో ఆమెకు విలాసవంతమైన స్టూడియో అపార్ట్‌మెంట్‌ను నిర్వాహకులు బహుమతిగా అందజేశారు. కాగా, బహుమతి గెలుచుకున్నట్లు కాల్ రాగానే.. ఆమె దీనిని స్పామ్ కాల్‌గా భ్రమపడటం గమనార్హం.