అక్షరటుడే, వెబ్‌డెస్క్: Prahlad Joshi | కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి విద్యాశాఖ అదనపు బాధ్యతలను కేంద్ర ప్రభుత్వం అప్పగించింది. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను కూడా రాష్ట్రపతి ఆమోదించారు.
ప్రస్తుతం ప్రహ్లాద్ జోషి కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార & ప్రజా పంపిణీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు వీటితో పాటు విద్యాశాఖను కూడా అదనంగా పర్యవేక్షించనున్నారు.
Jantar Mantar Protest | జంతర్‌మంతర్ వద్ద సాధారణ పరిస్థితులు..పునరుద్ధరించిన ఇంటర్నెట్ సేవలు
Prahlad Joshi | ఎవరు ఈ ప్రహ్లాద్ జోషి?
ప్రహ్లాద్ జోషి కర్ణాటకకు చెందిన సీనియర్ బీజేపీ నాయకుడు. ధార్వాడ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పలుమార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. పార్లమెంటరీ వ్యవహారాల్లో విశేష అనుభవం కలిగిన ఆయన, గతంలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖతో పాటు బొగ్గు, గనుల శాఖ మంత్రిగా కూడా సేవలందించారు.
ప్రస్తుతం వినియోగదారుల వ్యవహారాలు, ఆహార & ప్రజా పంపిణీ శాఖను నిర్వహిస్తూ కేంద్ర మంత్రివర్గంలో కీలక బాధ్యతలు చేపట్టారు. విద్యాశాఖ అదనపు బాధ్యతలు ప్రహ్లాద్ జోషికి అప్పగించడంతో కేంద్ర ప్రభుత్వ విద్యా విధానాలు, కీలక నిర్ణయాల అమలును ఆయన పర్యవేక్షించనున్నారు.