Hyderabad Traffic Advisory | వర్షాల ఎఫెక్ట్​.. ఐటీ కంపెనీలకు పోలీసుల ట్రాఫిక్ అడ్వైజరీ

భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్​లోని ఐటీ కంపెనీలు ఉద్యోగులకు త్వరగా లాగౌట్​ ఆప్షన్​ ఇవ్వాలని పోలీసులు సూచించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Hyderabad Traffic Advisory | తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్​ (Hyderabad) నగరంలో సైతం వాన పడుతోంది. దీంతో రోడ్లు జలమయం అయి ట్రాఫిక్​ జామ్ అవుతోంది. ఈ క్రమంలో ట్రాఫిక్​ పోలీసులు అడ్వైజరీ జారీ చేశారు.

నగరంలో గురువారం సాయంత్రం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు. సైబరాబాద్ ప్రాంతంలో పనిచేస్తున్న అన్ని కంపెనీలు, సంస్థలు ట్రాఫిక్​ రద్దీని తగ్గించేందుకు ఉద్యోగులకు త్వరగ లాగౌట్​ అవకాశ కల్పించాలని సూచించారు. వీలైతే వర్క్​ ఫ్రమ్​ హోమ్​ ఇవ్వాలని కోరారు. మధ్యాహ్నం 2:00 గంటల నుండి దశలవారీగా ముందుగానే లాగౌట్ చేయాలని సూచించారు.

Hyderabad Traffic Advisory | బయటకు రావొద్దు

నగరంలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతుండటంతో ఆయా కాలనీల్లోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కోరారు. సాయంత్రం వేళ అత్యవసరం అయితేనే బయటకు రావాలని సూచించారు. వీలైనంత వరకు మెట్రో సేవలను వినియోగించుకోవాలన్నారు. ట్రాఫిక్​ రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉందని వాహనదారులు పోలీసులు సూచనలు పాటించాలన్నారు.

ఇది కూడా చదవండి..: Hyderabad new flyovers | హైదరాబాద్‌లో ట్రాఫిక్ తీర్చేందుకు కొత్త ఫ్లైఓవర్లు..రూ. 368 కోట్లతో అనుమతులు మంజూరు..మరి ఆ కీలక ప్రాంతాల సంగతేంటి?

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *