Telangana School Uniform | తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. విద్యార్థులకు కొత్త యూనిఫామ్స్

తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలు , గురుకులాల్లో చదువుతున్న విద్యార్థుల యూనిఫామ్స్‌పై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Telangana School Uniform | తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలు , గురుకులాల్లో చదువుతున్న విద్యార్థుల యూనిఫామ్స్‌పై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అధికారులతో జరిగిన సమావేశం తర్వాత విద్యార్థుల కొత్త దుస్తుల రంగులను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే బాలురకు లైట్ బ్లూ షర్ట్, డార్క్ బ్లూ ప్యాంట్‌ను , బాలికలకు లైట్ బ్లూ టాప్, డార్క్ బ్లూ బాటమ్స్‌ను కొత్త యూనిఫామ్ రంగులుగా కేటాయించారు. అలాగే, గురుకుల పాఠశాలల విద్యార్థుల కోసం మెరూన్ చెక్స్ ఉన్న టాప్స్ , ప్లెయిన్ మెరూన్ లోవర్లను యూనిఫామ్‌గా నిర్ణయించారు.

Telangana School Uniform | ఒక్కొక్కరికి రెండు జతల చొప్పున..

ఈ విద్యాసంవత్సరం నుండి ప్రాథమిక స్థాయిలో ఒక ముఖ్యమైన మార్పు చేస్తూ.. 6వ తరగతి విద్యార్థులకు నిక్కర్లకు బదులుగా ప్యాంట్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దాదాపు 27 లక్షల మంది ప్రభుత్వ విద్యార్థులకు ఒక్కొక్కరికి రెండు జతల చొప్పున ఈ కొత్త దుస్తులను అందించనున్నారు.

Telangana School Uniform | ఆగస్టు 15 న మొదటి జత..

ఇందులో మొదటి జత యూనిఫామ్‌ను ఆగస్టు 15 (స్వాతంత్ర్య దినోత్సవం) రోజు విద్యార్థులకు పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కేవలం దుస్తులు మాత్రమే కాకుండా, విద్యార్థులందరికీ ఉచితంగా బూట్లు (Shoes), సాక్సులు, టై (Tie) , బెల్ట్‌ను కూడా ప్రభుత్వం అందజేయనుంది. ఈ సరికొత్త నిర్ణయంతో సర్కారీ బడి పిల్లలకు మరింత ఆకర్షణీయమైన కార్పొరేట్ లుక్ రానుంది.

ఇది కూడా చదవండి: Ramchander Rao | తెలంగాణలో త్వరలో డబుల్ ఇంజన్ సర్కార్: రామచందర్ రావు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *