అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Kalyana Lakshmi Scheme | కల్యాణలక్ష్మి పథకం లక్షలాది ఆడబిడ్డల జీవితాల్లో వెలుగు నింపిందని మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) అన్నారు. ఈ పథకంతో బాల్య వివాహాలు తగ్గాయన్నారు. పథకం ప్రారంభించి 12 ఏళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా ఆయన ఎక్స్‌వేదికగా పోస్టు చేశారు.
బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 అక్టోబర్ 2న రూ.51,000 ఆర్థిక సాయంతో కేసీఆర్ కల్యాణలక్ష్మి పథకాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. ఆ మొత్తాన్ని 2017లో రూ.75,116కు, 2018లో రూ.1,00,116కు పెంచారన్నారు. బీఆర్ఎస్ పాలనలో 13,15,297 మంది ఆడబిడ్డలకు రూ.11,560 కోట్లకు పైగా ఆర్థిక సాయం అందించామని వెల్లడించారు.
Kalyana Lakshmi Scheme | లబ్ధిదారుల ఎదురుచూపులు
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కల్యాణలక్ష్మి పథకాన్ని నిర్లక్ష్యం చేసిందని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెళ్లిళ్లు అయిపోయి.. పిల్లలు పుట్టినా.. కల్యాణలక్ష్మి డబ్బులు అందడం లేదని విమర్శించారు. తమ హయాంలో ఈ పథకం కోసం ఏడాదికి రూ.2500 కోట్లు ఖర్చు చేశామన్నారు. కాంగ్రెస్ మాత్రం సగం కూడా ఖర్చు చేయడం లేదని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో రూ.లక్ష నగదుతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ నాయకులు తర్వాత ఆ హామీని గాలికి వదిలేశారన్నారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రలు ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న కల్యాణలక్ష్మి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలన్నారు.
ఇది కూడా చదవండి..: Telangana Inter Internal Marks | ఇంటర్ విద్యార్థులకు అలెర్ట్..ఫస్టియర్‌లోనూ ఇంటర్నల్స్, ప్రాక్టికల్స్!