BSNL Insurance Offer | బీఎస్ఎన్ఎల్ ధమాకా ఆఫర్.. ఫోన్ రీచార్జ్ చేసుకుంటే చాలు లక్ష బీమా కవరేజీ

బీఎస్ఎన్ఎల్ తన కస్టమర్ల కోసం అద్భుతమైన ఆఫర్‌ను తీసుకువచ్చింది. రీచార్జ్‌తోపాటు రూ. లక్ష బీమా కవరేజీని అందిస్తోంది.

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్ : BSNL Insurance Offer | ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) ప్రైవేట్ టెలికాం కంపెనీలకు గట్టి పోటీని ఇచ్చేందుకోసం కొత్తకొత్త ఆఫర్‌లతో వస్తోంది. ఈసారి వినూత్న ఆఫర్‌తో వచ్చింది. తన కస్టమర్లకు బీమా భరోసా ఇస్తూ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. ప్రీపెయిడ్ ప్లాన్‌ను రీచార్జ్ చేసుకోవడం ద్వారా కాలింగ్, మొబైల్ డేటాతో పాటు ఇన్సూరెన్స్ కవరేజీని అందించే ప్లాన్లను ప్రకటించింది.

BSNL Insurance Offer | ఎస్టీవీ 202 ప్లాన్:

ఈ ప్లాన్ రీచార్జ్ చేసుకుంటే వినియోగదారులకు 300 నిమిషాల వాయిస్ కాలింగ్, 5జీబీ ఇంటర్నెట్ డేటా, 100 ఎస్సెమ్మెస్‌లు వస్తాయి. ప్లాన్ వాలిడిటీ 30 రోజులు.

BSNL Insurance Offer | ఎస్టీవీ 2449 ప్లాన్:

ఇది దీర్ఘకాలిక ప్లాన్. దీని గడువు 365 రోజులు. ఇందులో దేశవ్యాప్తంగా అపరిమిత వాయిస్ కాలింగ్ సౌకర్యంతోపాపటు రోజుకు 2జీబీ డేటా, 100 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి.

BSNL Insurance Offer | బీమా కవరేజ్…

బీఎస్ఎన్ఎల్ ప్రవేశపెట్టిన ఈ ప్లాన్లతో ఉచిత ఇన్సూరెన్స్ ప్రయోజన్నాయి. ఈ బీమా సదుపాయాన్ని అందించడం కోసం సంస్థ ది ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ ఆఫర్ కింద వినియోగదారుడు ఏదైనా ప్రమాదానికి గురై మరణిస్తే అతడి నామినీకి రూ.లక్ష వరకు ప్రమాద బీమా లభిస్తుంది. దీనికి తోడు ఆన్‌లైన్ మోసాల బారిన పడి ఖాతాదారులు నష్టపోకుండా ఉండేందుకు రూ.10 వేల వరకు సైబర్ ఫ్రాడ్ కవరేజీని కూడా బీఎసఎనఎల్ అదిస్తోంది.

BSNL Insurance Offer | 24 గంటల తర్వాత అమలులోకి..

బీమా కవరేజ్ పొందడానికి వినియోగదారులు ఎలాంటి అదనపు ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. ఎస్టీవీ 202 ప్లాన్ లేదా ఎస్టీవీ 2449 ప్లాన్ రీచార్జ్ చేసుకుంటే సరిపోతుంది. రీఛార్జ్ విజయవంతమైన 24 గంటల తర్వాత ఈ ఉచిత బీమా పాలసీ యాక్టివేట్ అవుతుంది. పాలసీ యాక్టివేట్ అయ్యాక దానికి సంబంధించిన పూర్తి వివరాలు వినియోగదారుకు ఎస్సెమ్మెస్ ద్వారా అందుతాయి. ఈ బీమా ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ నిర్దేశించిన నిబంధనలు, షరతులకు లోబడి వర్తిస్తుందని సంస్థ తెలిపింది.

BSNL Insurance Offer | తొలి సంస్థగా రికార్డు..

రీచార్జ్‌తో ఉచిత బీమా ప్లాన్‌లు అక్టోబర్ 1వ తేదీనుంచి అమలులోకి వచ్చాయి. తద్వారా రీచార్జ్ ప్లాన్‌తో బీమా అందిస్తున్న తొలి టెలికాం ఆపరేటర్‌గా బీఎస్ఎన్ఎల్ నిలిచింది.

ఇది కూడా చదవండి..: Oct 02 Gold Prices | పసిడి కొనుగోలు చేస్తున్నారా.. హైదరాబాద్‌లో బంగారం ధరలు ఇవే!

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *