Odonil Car Freshener| ఓడొనిల్ కార్ ఫ్రెషనర్ మార్కెట్లోకి ఎంట్రీ.. ‘ఓషన్ బ్రీజ్’, ‘రూబీ మిస్ట్’ లాంచ్!

ఇళ్లలో సువాసనలు వెదజల్లడంలో దశాబ్దాలుగా గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ ఎయిర్-ఫ్రెషనర్ బ్రాండ్ 'ఓడొనిల్' (Odonil).. తాజాగా 'ఓడొనిల్ కార్ ఫ్రెషనర్' ప్రీమియం శ్రేణిని మార్కెట్లోకి విడుదల చేసింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Odonil Car Freshener | ఇళ్లలో సువాసనలు వెదజల్లడంలో దశాబ్దాలుగా గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ ఎయిర్-ఫ్రెషనర్ బ్రాండ్ ‘ఓడొనిల్’ (Odonil).. తాజాగా ‘ఓడొనిల్ కార్ ఫ్రెషనర్’ ప్రీమియం శ్రేణిని మార్కెట్లోకి విడుదల చేసింది. డాబర్ సంస్థకు చెందిన ఈ కొత్త ఉత్పత్తులు రోజువారీ ప్రయాణాలను మరింత ఉత్సాహంగా, ఆహ్లాదకరంగా మార్చడానికి దోహదపడతాయి. వినియోగదారుల వ్యక్తిగత ప్రయాణాలకు కార్లు ప్రధాన వేదికగా మారుతున్న నేపథ్యంలో, గృహోపకరణాల రంగంలో తమకు ఉన్న ఐదు దశాబ్దాల అనుభవంతో ఓడొనిల్ ఈ కొత్త విభాగానికి శ్రీకారం చుట్టింది.

రెండు సరికొత్త వేరియంట్లు , అనుభూతి..
ఈ కొత్త శ్రేణిలో భాగంగా ‘ఓషన్ బ్రీజ్’ (Ocean Breeze), ‘రూబీ మిస్ట్’ (Ruby Mist) అనే రెండు ప్రత్యేకమైన గమ్యస్థాన-ప్రేరేపిత సువాసనలను అందుబాటులోకి తెచ్చారు. ఇవి కార్లలో దాదాపు 45 రోజుల పాటు సువాసనను, తాజాదనన్ని అందిస్తాయి. ఫైన్-పెర్ఫ్యూమరీ స్ఫూర్తితో రూపొందించిన ఈ సువాసనలు కాలక్రమేణా మారుతూ గొప్ప అనుభూతిని ఇస్తాయి.

ఓషన్ బ్రీజ్: సముద్రపు చల్లటి గాలి, అలల అనుభూతిని కలిగించే క్రిస్ప్ ఆక్వాటిక్ నోట్లతో ఇది రూపుదిద్దుకుంది. ట్రాఫిక్ హడావుడిలో ప్రయాణించే వారికి ఇది ప్రశాంతమైన, రిలాక్సింగ్ అనుభూతిని ఇస్తుంది.

రూబీ మిస్ట్: సిట్రస్, సొగసైన పూలు, వెచ్చని అంబర్, ఉడ్‌ నోట్ల కలయికతో పర్వత ప్రాంతాల ప్రయాణ అనుభూతిని ఇస్తూ కారులో చక్కటి ఉత్సాహాన్ని, సొగసైన వాతావరణాన్ని నింపుతుంది.

Odonil Car Freshener | ప్రత్యేకతలు..

కారు లోపల ఉండే పొగ , మొండి దుర్వాసనలను సమర్థవంతంగా తొలగించడానికి ఇందులో ‘యాంటీ-స్మోక్ టెక్నాలజీ’ని పొందుపరిచారు. అలాగే, యూజర్లు తమకు నచ్చిన విధంగా సువాసన తీవ్రతను అడ్జస్ట్ చేసుకునేందుకు ‘ఫ్రాగ్రెన్స్ రెగ్యులేటర్’ కూడా అందుబాటులో ఉంది. ఇది ఆఫీస్ ప్రయాణాలు, ఫ్యామిలీ ట్రిప్స్ వంటి అన్ని సమయాల్లోనూ చక్కటి సువాసనను అందిస్తుంది.

లభ్యత వివరాలు..
ఈ ఓడొనిల్ కార్ ఫ్రెషనర్ ధర కేవలం రూ. 99 (8 మి.లీ) మాత్రమే. ఇది సింగిల్ ప్యాక్‌తో పాటు, రెండు ‘ఓషన్ బ్రీజ్’, ఒక ‘రూబీ మిస్ట్’ ఉండే వ్యాల్యూ ప్యాక్‌లో కూడా లభిస్తుంది. ప్రస్తుతం ప్రముఖ ఈ-కామర్స్, క్విక్-కామర్స్ , రిటైల్ స్టోర్లలో ఇవి కొనుగోలుకు సిద్ధంగా ఉన్నాయి.

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *