Skip to content
Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
Subscribe
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Pages
    • Home
    • Blog Index
    • Contact Us
    • Search Page
    • 404 Page
  • Personalized
    • My Feed
    • My Saves
    • My Interests
    • History
  • Categories
Follow US

Home - హైదరాబాద్

హైదరాబాద్

Ameerpet Fire Accident | అమీర్‌పేట్‌లో భారీ అగ్నిప్రమాదం.. దట్టమైన పొగతో రోడ్డు బ్లాక్

Shivam nagarani
Last updated: June 4, 2026, 2:16 pm 2:16 pm
Shivam nagarani
Share
Ameerpet Fire Accident

అక్షరటుడే వెబ్‌డెస్క్: Ameerpet Fire Accident | నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతమైన అమీర్‌పేట్‌లో గురువారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మైత్రివనం సమీపంలోని మెయిన్ రోడ్డుపై ఉన్న ఒక షాపింగ్ కాంప్లెక్స్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. బిల్డింగ్ రెండో అంతస్తు నుంచి మొదలైన మంటలు క్షణాల వ్యవధిలోనే భవనం అంతటా వ్యాపించాయి.

Ameerpet Fire Accident | ‘KSR ఫ్యాషన్స్’లో మొదలై..

మెట్రో పిల్లర్ నంబర్ A1043, శ్రీనివాసనగర్ వెస్ట్ సమీపంలో ఉన్న ‘KSR ఫ్యాషన్స్’ బట్టల దుకాణంలో ఈ ప్రమాదం జరిగింది. షాపులో అంతా వస్త్రాలు కావడంతో మంటలు అత్యంత వేగంగా ఎగసిపడ్డాయి. ప్రమాద తీవ్రతకు పక్కనే ఉన్న ‘హర్ష మెస్’ సహా ఇతర వ్యాపార సముదాయాలకు కూడా మంటలు అంటుకున్నాయి. ప్రమాద స్థలంలో దట్టమైన నల్లటి పొగలు అలుముకోవడంతో రోడ్డు కూడా సరిగ్గా కనిపించని పరిస్థితి ఏర్పడింది. దీంతో స్థానిక వ్యాపారులు, జనం తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

ameerpet.1

Ameerpet Fire Accident | ఘటనా స్థలానికి ఫైర్ ఇంజన్లు..

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం ఆరు ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో మరిన్ని వాటర్ ట్యాంకర్లను రప్పిస్తున్నారు. అయితే, ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు ప్రాథమికంగా ప్రకటించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.

ameerpet.2

Ameerpet Fire Accident | వాహనదారులకు ట్రాఫిక్ అలర్ట్..

అగ్ని ప్రమాదం , సహాయక చర్యల నేపథ్యంలో అమీర్‌పేట్ నుండి ఎస్సార్ నగర్ వెళ్లే ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. అమీర్‌పేట్ వైపు వచ్చే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీస్ కమిషనర్ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. విధుల్లో ఉన్న ట్రాఫిక్, అత్యవసర సిబ్బందికి వాహనదారులు సహకరించాలని కోరారు.

 

ట్రాఫిక్ అలర్ట్!

అమీర్‌పేటలోని శ్రీనివాసనగర్ వెస్ట్, మెట్రో పిల్లర్ నంబర్ A1043 సమీపంలో ఉన్న కెఎస్సార్ ఫ్యాషన్స్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. అత్యవసర సహాయక చర్యల కారణంగా, అమీర్‌పేట నుండి ఎస్సార్ నగర్ మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది, దీనివల్ల ఈ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్…

— V.C. Sajjanar, IPS (@SajjanarVC_IPS) June 4, 2026

ఇది కూడా చదవండి:  BJP President comments | ‘కాక్రోచ్​ పార్టీ’ వెనక అర్బన్​ నక్సల్స్​.. బీజేపీ చీఫ్​ సంచలన వ్యాఖ్యలు

TAGGED:Ameerpet Fire AccidentAmeerpet Traffic AlertFire Rescue OperationHyderabad Breaking Newshyderabad fire newsKSR Fashions Firelatest newsShopping Complex FireTelangana Fire Incidenttelugu news
ByShivam nagarani
Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Previous Article Makthal Development Project Makthal Development Project | మక్తల్‌పై సీఎం రేవంత్ ప్రత్యేక శ్రద్ధ.. నేడు మంత్రులతో కలిసి ఏరియల్ సర్వే
Next Article Southwest Monsoon Southwest Monsoon | కేరళంను తాకిన రుతుపవనాలు.. జూన్​ రెండో వారంలో రాష్ట్రంలోకి..
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

Swimming Pool Death
హైదరాబాద్

Swimming Pool Death | బర్త్​ డే వేడుకల్లో విషాదం.. స్విమ్మింగ్ ​పూల్​లో పడి యువకుడి మృతి

By Balla Sandeep Kumar
Tirupati Minor Assault
ఆంధ్రప్రదేశ్​తెలంగాణహైదరాబాద్

Tirupati Minor Assault | దారుణం.. 16 ఏళ్ల బాలికపై సొంత బాబాయ్ లైంగిక దాడి

By Naresh Chandan
Gandhi Bhavan Clash
హైదరాబాద్

Gandhi Bhavan Clash | గాంధీభవన్‌లో హైడ్రామా.. వేదికపైనే కొట్టుకున్న కాంగ్రెస్ నేతలు

By Shivam nagarani
SIR Process Allegations
తెలంగాణ

SIR Process Allegations | కేంద్రం పైసలిస్తున్నా ధాన్యం ఎందుకు కొనట్లేదు? రేవంత్ సర్కార్‌పై కిషన్ రెడ్డి ఫైర్

By Shivam nagarani
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.