Trump Iran Deal | ఒప్పందం ఫైనల్ కాదు.. నచ్చకపోతే మళ్లీ దాడులే: ట్రంప్

ఇరాన్‌తో అమెరికా కుదుర్చుకోబోయేది కేవలం ఒక ప్రాథమిక అవగాహన ఒప్పందం మాత్రమేనని, ఇది తుది నిర్ణయం కాదని ట్రంప్ స్పష్టం చేశారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Trump Iran Deal | ఇరాన్‌తో అమెరికా కుదుర్చుకోబోయేది కేవలం ఒక ప్రాథమిక అవగాహన ఒప్పందం మాత్రమేనని, ఇది తుది నిర్ణయం కాదని ట్రంప్ ( Trump )స్పష్టం చేశారు. ఫ్రాన్స్‌లో జరుగుతున్న జీ7 సదస్సులో పాల్గొన్న ఆయన, ఇరాన్ తీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఒప్పందంలోని అంశాలు తమకు అనుకూలంగా లేకపోయినా, లేదా ఇరాన్ ప్రవర్తనలో మార్పు రాకపోయినా.. ఆ దేశంపై దాడులు చేసేందుకు వెనుకాడబోమని ట్రంప్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. మరో రెండు రోజుల్లో ఈ ఒప్పందంపై ఇరుదేశాలు సంతకాలు చేయనున్న నేపథ్యంలో, ఆయన చేసిన ఈ ప్రకటన అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.

Trump Iran Deal | ఎలాంటి పెట్టుబడులు పెట్టడం లేదు..

ఇరాన్ పునర్నిర్మాణం కోసం అమెరికా సుమారు 300 బిలియన్ డాలర్ల నిధులను సమకూరుస్తోందనే వార్తలను ట్రంప్ పూర్తిగా తోసిపుచ్చారు. “మేము ఎలాంటి పెట్టుబడులు పెట్టడం లేదు. మా వద్ద అటువంటి ప్రత్యేక నిధులు లేవు” అని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్‌లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా గల్ఫ్ దేశాలను తాము కోరడం లేదని ట్రంప్ తెలిపారు. ఒకవేళ ఆ దేశాలు సొంతంగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తే తమకు ఎటువంటి అభ్యంతరం లేదని, కానీ ఇరాన్ వ్యవహారశైలిపై పూర్తి స్పష్టత వచ్చే వరకు అవి వేచి చూసే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Nizamabad DRM | ఆర్టీసీ నిజామాబాద్ డీఆర్​ఎంగా జ్యోతి

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *