Vijay Divorce Petition | సీఎం విజయ్ విడాకుల కేసులో బిగ్ ట్విస్ట్.. పిటిషన్‌ వెనక్కి తీసుకున్న భార్య సంగీత

తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే (TVK) అధినేత దళపతి విజయ్, ఆయన భార్య సంగీత విడాకుల వ్యవహారానికి తెరపడింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Vijay Divorce Petition | తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే (TVK) అధినేత దళపతి విజయ్, ఆయన భార్య సంగీత విడాకుల వ్యవహారానికి తెరపడింది. విజయ్ నుంచి విడాకులు కోరుతూ గతంలో చెంగల్పట్టు కుటుంబ సంక్షేమ న్యాయస్థానంలో దాఖలు చేసిన పిటిషన్‌ను సంగీత అధికారికంగా వెనక్కి తీసుకున్నారు. ఈ విజ్ఞటనపై స్పందించిన న్యాయమూర్తి కేసును ముగిస్తున్నట్లు తీర్పు వెలువరించారు.

Vijay Divorce Petition | 27 ఏళ్ల దాంపత్య బంధం..

సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్ వ్యక్తిగత జీవితంపై గత కొంతకాలంగా రకరకాల చర్చలు నడిచాయి. 1999 ఆగస్టు 25న వివాహం చేసుకున్న ఈ దంపతులకు కుమారుడు జేసన్ సంజయ్, కుమార్తె దివ్య సాషా ఉన్నారు. దాదాపు 27 ఏళ్ల సుదీర్ఘ కాలం పాటు కలిసి ఉన్న వీరిద్దరి మధ్య వ్యక్తిగత కారణాల వల్ల మనస్పర్థలు తలెత్తడంతో, సంగీత ప్రత్యేక వివాహ చట్టం కింద విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు.
vijay 1

 

Vijay Divorce Petition | రాజీ కుదరడంతో ఉపసంహరణ..

చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో ఈ కేసుకు సంబంధించి పలుమార్లు విచారణ జరిగింది. ఈ క్రమంలో ఇరువురి మధ్య రాజీ, సామరస్య వాతావరణం కుదరడంతో కేసును ఇకపై కొనసాగించడం ఇష్టం లేక సంగీత తన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. కోర్టు దీనిని ఆమోదించి కేసును ముగిస్తున్నట్లు ప్రకటించడంతో విజయ్ అభిమానులు, మద్దతుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: OBC National Conference | ఓబీసీ 11వ జాతీయ మహాసభల్లో నిజామాబాద్ బీసీ శ్రేణులు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *