OBC National Conference | ఓబీసీ 11వ జాతీయ మహాసభల్లో నిజామాబాద్ బీసీ శ్రేణులు

బెంగళూరులో జరుగుతున్న ఓబీసీ 11వ జాతీయ మహాసభల్లో నిజామాబాద్ బీసీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నాయి.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ : OBC National Conference | బెంగళూరులో జరుగుతున్న ఓబీసీ 11వ జాతీయ మహాసభల్లో నిజామాబాద్ (Nizamabad) బీసీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నాయి. కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో ఈ మహాసభలు జరుగుతున్నాయి.

OBC National Conference | మండల్​ సిఫార్సులు అమలైన సందర్భంగా..

ఆగస్టు 7న మండల సిఫార్సులు అమలై బీసీలకు రిజర్వేషన్లు వచ్చిన సందర్భంగా ప్రతి ఏడాది దేశవ్యాప్తంగా ఓబీసీ జాతీయ మహాసభలను నిర్వహిస్తుంటారని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్​ పేర్కొన్నారు. ఈ ఏడాది కర్ణాటకలోని బెంగళూరులో జరుగుతున్న ఈ మహాసభలకు నిజామాబాద్​ జిల్లాలోని బీసీలు పెద్దఎత్తున హాజరయ్యారని ఆయన వివరించారు. దేశంలో ఎక్కడ బీసీ కార్యక్రమం జరిగిన నిజామాబాద్ జిల్లా నుండి పెద్ద ఎత్తున పాల్గొని మన గళాన్ని వినిపించడం సంతోషంగా ఉందన్నారు. ఈ మహాసభల్లో సంఘం ప్రతినిధులు కరిపె రవీందర్, కొయ్యాడ శంకర్, మాడవేడి వినోద్ కుమార్, చంద్రకాంత్, శ్రీలత, ఆర్టీసీ శ్రీనివాస్, చంద్రమోహన్, భూమన్న, రవి, బాలన్న శ్రీనివాస్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

OBC National Conference

ఇది కూడా చదవండి..: Mittapalli Temple | మిట్టపల్లి ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి నిధులు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *