Chandrababu | ఖజానా ఖాళీగా ఉంది.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Chandrababu | ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu) సంచలన వ్యాఖ్యలు చేశారు. పేదలకు ఎంతైనా ఖర్చు పెట్టాలని అనుకుంటున్నా, కానీ ఖజానా ఖాళీగా ఉందన్నారు.

నేతన్న సేవలో పథకాన్ని చంద్రబాబు నాయుడు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గుంతలు తవ్విన రాష్ట్రాన్ని తనకు అప్పజెప్పారని పేర్కొన్నారు. రోడ్లపై ఉన్న గుంతలన్నీ పూడ్చామని తెలిపారు. అభివృద్ధిపైనే ఫోకస్ పెడుతున్నామని చెప్పారు. కూటమి ప్రభుత్వం వెనుకబడిన వర్గాలకు రుణపడి ఉందన్నారు.

Chandrababu | పిల్లలుంటే సంపద

గత ప్రభుత్వంలో చేనేత కార్మికులు ఇబ్బందులు పడ్డారని బాబు అన్నారు. అగ్గిపెట్టెలో పట్టే చీరను తయారుచేసిన ఘనత మన చేనేత కార్మికులదని కొనియాడారు. 45 ఏళ్లుగా బీసీలు టీడీపీకి వెన్నెముకగా ఉన్నారని గుర్తు చేసుకున్నారు. తాము ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు ఇచ్చామని చెప్పారు. సంజీవని హెల్త్ ప్రాజెక్ట్ తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. అందరికీ రూ.2.50 లక్షల వరకు హెల్త్ ఇన్సూరెన్స్ అందిస్తామని వెల్లడించారు. మొన్నటివరకు పిల్లలంటే భారం.. ఇప్పుడు సంపద అని చంద్రబాబు అన్నారు.

Chandrababu | చీరాల పక్కన ఎయిర్​పోర్టు

Chandrababu

శారీర‌కంగా కాదు.. తెలివితేట‌ల‌తో క‌ష్ట‌ప‌డితే ఈజీగా డ‌బ్బు సంపాదించ‌వ‌వచ్చని బాబు తెలిపారు. బీచ్‌ల మీద ఫోక‌స్ చేసి.. చీరాల ప‌క్క‌నే చిన్న ఎయిర్‌పోర్టు క‌డ‌తామన్నారు. రోడ్లు, పోర్టులు, విమానాశ్ర‌యాలు క‌ట్టి ఎక్క‌డిక‌క్క‌డ లాజిస్టిక్ హ‌బ్‌గా ఏపీని త‌యారు చేస్తామన్నారు. శనివారం వస్తే హైదరాబాద్ ఖాళీ అవుతోందని బాబు అన్నారు. ప్రజలు బాపట్ల జిల్లాలోని సూర్యలంక బీచ్‌కు వస్తున్నారని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి..: Rajahmundry Accident | కారు ఢీకొని.. వైద్య విద్యార్థిని బ్రెయిన్ డెడ్

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *