Cauvery Water Dispute | కావేరీ జలాల వివాదం.. ప్రజల కోసం ఎన్ని అవమానాలనైనా ఎదుర్కొంటా: సీఎం విజయ్

తమిళనాడు శాసనసభ సమావేశాల్లో కావేరీ జలాల వివాదంపై అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర చర్చ జరిగింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Cauvery Water Dispute | తమిళనాడు శాసనసభ సమావేశాల్లో కావేరీ జలాల వివాదంపై అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర చర్చ జరిగింది. మేకెదాటు ప్రాజెక్ట్, కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు తదితర అంశాలపై ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన విమర్శలకు ముఖ్యమంత్రి విజయ్ గట్టిగా బదులిచ్చారు. తమిళనాడు ప్రజల ప్రయోజనాల కోసం ఎన్ని అవమానాలనైనా ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.

Cauvery Water Dispute | ఉదయనిధి  విమర్శలు..

అసెంబ్లీలో డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ ప్రభుత్వ తీరును ప్రశ్నించారు. మేకెదాటు ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టకుండా కర్ణాటకను అడ్డుకోవడానికి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో చెప్పాలని నిలదీశారు. పొరుగు రాష్ట్రం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఐకమత్యాన్ని ప్రదర్శిస్తే, టీవీకే ప్రభుత్వం మాత్రం అఖిలపక్ష భేటీకి నిరాకరిస్తోందని ఆరోపించారు. అసలు మేకెదాటు గురించి చర్చించేందుకు సీఎం బెంగళూరుకు వెళ్లాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.

Cauvery Water Dispute |సీఎం విజయ్ దీటైన సమాధానం..

ఉదయనిధి విమర్శలపై సీఎం విజయ్ స్పందిస్తూ.. మేకెదాటు ప్రాజెక్ట్‌ నిర్మాణానికి వ్యతిరేకంగా ప్రభుత్వం ఇప్పటికే అసెంబ్లీలో తీర్మానం ఆమోదించిందని, దీనిపై ప్రధాని మోదీకి కూడా లేఖ రాసినట్లు గుర్తుచేశారు. అయితే, 1969లోనే ఈ ప్రాజెక్ట్‌కు తొలిసారిగా అనుమతి ఇచ్చింది డీఎంకే ప్రభుత్వమేనని ఆయనకు గట్టి కౌంటర్ ఇచ్చారు. బెంగళూరు పర్యటనను సమర్థించుకుంటూ.. శత్రు దేశాలు సైతం సమస్యలను చర్చల ద్వారానే పరిష్కరించుకుంటున్నాయని తెలిపారు. పొరుగు రాష్ట్రానికి వెళితే అవమానాలు ఎదురవుతాయని కొందరు అంటున్నారని, ఒకవేళ తమిళనాడు ప్రజల కోసం ఎన్ని అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చినా వెనకాడేది లేదని తేల్చిచెప్పారు.

ఇది కూడా చదవండి: Mittapalli Temple | మిట్టపల్లి ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి నిధులు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *