Amaravati YSRCP Tour | రాజధానిలో ‘రౌడీల’ రచ్చ.. వైకాపా నేతలపై కేసులు

రాజధాని ప్రాంతంలో వైకాపా నేతలు చేపట్టిన పర్యటన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Amaravati YSRCP Tour | రాజధాని ప్రాంతంలో వైకాపా నేతలు చేపట్టిన పర్యటన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. పర్యటనలో భాగంగా జరిగిన రాళ్ల దాడి, తోపులాటలు , పోలీసులపై దాడి ఘటనల నేపథ్యంలో తాడేపల్లి పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. పరస్పర ఫిర్యాదుల ఆధారంగా ఇప్పటివరకు మూడు కీలక కేసులు నమోదు చేశారు.

Amaravati YSRCP Tour | కేసుల వివరాలు..

పెనుమాకకు చెందిన మాణిక్యం అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో వైకాపా నేతలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. విధుల్లో ఉన్న పోలీసు అధికారిపై దాడికి పాల్పడటం, ఆయనను నెట్టివేయడం వంటి ఆరోపణలతో మాజీ మంత్రి అంబటి రాంబాబుపై (  Ambati Rambabu ) తాడేపల్లి సీఐ వీరేంద్రబాబు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు 30 యాక్టు కింద కేసు నమోదు చేశారు. వైకాపా నేత నారాయణమూర్తి ఫిర్యాదు మేరకు, తన కారు అద్దాలను పగలగొట్టిన తెదేపా నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ycp

Amaravati YSRCP Tour | నిందితుల జాబితాలో రౌడీషీటర్లు..

ఈ పర్యటనలో సాధారణ కార్యకర్తలతో పాటు రౌడీషీటర్లు కూడా పాల్గొన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ముఖ్యంగా గతంలో తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన వ్యక్తులే ఈ పర్యటనలో కూడా పాల్గొన్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. కానిస్టేబుల్‌పై జరిగిన దాడి వెనుక కూడా ఈ రౌడీషీటర్ల బ్యాచ్ హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.

Amaravati YSRCP Tour | దర్యాప్తులో  కీలక అంశాలు.

రైతులను రెచ్చగొట్టేందుకే తొలుత రాళ్ల దాడికి పాల్పడ్డారని పోలీసులు భావిస్తున్నారు. గతంలో తెదేపా కార్యాలయంపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న చైతన్య, వైకాపా నేతల పర్యటనలో ఉండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనల వెనుక ఉన్న అసలు సూత్రధారులను గుర్తించేందుకు పోలీసులు వీడియో ఫుటేజీని , క్షేత్రస్థాయి ఆధారాలను నిశితంగా పరిశీలిస్తున్నారు.

ఇది కూడా చదవండి:  US Iran Airstrikes | 10 ఇరాన్ స్థావరాలపై దాడులు.. ఫుటేజ్‌ విడుదల చేసిన అమెరికా..

 

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *