Mittapalli Temple | మిట్టపల్లి ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి నిధులు

డిచ్​పల్లి మండలం మిట్టపల్లి గ్రామంలో ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి రూరల్​ ఎమ్మెల్యే భూపతిరెడ్డి నిధులు మంజూరు చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, డిచ్​పల్లి: Mittapalli Temple | మండలంలోని మిట్టపల్లి గ్రామంలో ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి రూరల్​ ఎమ్మెల్యే భూపతిరెడ్డి (MLA Bhupathi Reddy) నిధులు మంజూరు చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం గ్రామస్థులు ఆయనను ఘనంగా సన్మానించారు. ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి గ్రామస్థులు తమవంతుగా రూ. 8 లక్షలు సమకూర్చగా, రూ. 32 లక్షలు ప్రభుత్వం దేవాదాయ శాఖ కింద మంజూరయ్యాయి. ఇందుకు సంబంధించిన ప్రొసీడిoగ్స్ పత్రాన్ని ఎమ్మెల్యే అందజేశారు.

Mittapalli Temple | ఆలయ అభివృద్ధి బాధ్యత నాది..

ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని.. ప్రజలంతా ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలని ఎమ్మెల్యే అన్నారు. గ్రామస్తులంతా కలిసికట్టుగా పార్టీ బలోపేతానికి కృషిచేయాలని గ్రామాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తాను తీసుకుంటానని పేర్కొన్నారు. ఏ ఆపద వచ్చిన కష్టకాలంలో తోడుగా ఉంటానని అభయమిచ్చారు. అనంతరం గ్రామానికి చెందిన పలువురు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా వారందరికీ కండువాలు వేసి ఆహ్వానం పలికారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ బాల గంగాధర్, కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు లింబాద్రి, ప్రధాన కార్యదర్శి కిషన్, ఉపాధ్యక్షుడు గంగారాం, రాజన్న, ఎండి అబీబ్ ఖాన్, రమేష్ పాల్గొన్నారు.

Bhupathi Reddy Warning

ఇది కూడా చదవండి..: Adulterated Toddy | ప్రజల ప్రాణాలతో చెలగాటం.. యథేచ్ఛగా కల్తీకల్లు దందా

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *