Hyderabad Water Supply | హైదరాబాద్ వాసులకు అలెర్ట్​.. నీటి సరఫరాలో అంతరాయం

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Hyderabad Water Supply | హైదరాబాద్ (Hyderabad) నగరంలోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఉంటుందని జల మండలి అధికారులు తెలిపారు. ప్రజలు నీటిని పొదుపుగా వాడుకొని తమకు సహకరించాలని కోరారు.

పటాన్​చెరు సమీపంలో జాతీయ రహదారి విస్తరణ పనులు సాగుతున్నాయి. ఈ పనులు చేపడుతుండగా నగరానికి మంచినీరు సరఫరా చేసే మంజీరా ఫేస్​ –2కు చెందిన భారీ 1500 mm తాగునీటి పైప్‌లైన్ దెబ్బతింది. దీనివల్ల నగరంలోని పలు ప్రాంతాలకు నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

Hyderabad Water Supply | పరిశీలించిన ఎండీ

పైప్​లైన్​ పగిలిపోగానే జలమండలి (HMWS SB) అధికారులు అప్రమత్తం అయ్యారు. వెంటనే నీటిసరఫరాను నిలిపి వేసి మరమ్మతులు ప్రారంభించారు. జలమండలి ఎండీ అశోక్​రెడ్డి మరమ్మతు పనులను పరిశీలించారు. అత్యవసర మరమ్మతులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి, నీటి సరఫరాను త్వరగా పునరుద్ధరించాలని ఆదేశించారు.

Hyderabad Water Supply | ఈ ప్రాంతాల్లో నీళ్లు రావు

పైప్​లైన్​ పగిలిపోవడంతో మియాపూర్​, కూకట్​పల్లి, కేపీహెచ్​బీ, చందానగర్​, లింగంపల్లి, ఆర్సీ పురం, ఎస్​ఆర్​ నగర్​, అమీర్​పేట, అమీన్​పూర్​ ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఉంటుంది. నీటి సరఫరా దశలవారీగా పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు.

ఇది కూడా చదవండి : ACB Raids | జలమండలి జీఎం ఇంట్లో ఏసీబీ సోదాలు.. ఆస్తులు చూసి షాకైన అధికారులు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *