Food Safety | బోధన్​లో ఫుడ్​సేఫ్టీ అధికారుల దాడులు.. రెస్టారెంట్లకు నోటీసులు

బోధన్​ పట్టణంలోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, రెస్టారెంట్లపై ఫుడ్​ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. పలు హోటళ్లకు నోటీసులు జారీ చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, బోధన్​: Food Safety | పట్టణంలోని(Bodhan) ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, రెస్టారెంట్లపై ఫుడ్​ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు హోటళ్లకు నోటీసులు జారీ చేశారు.

Food Safety | బోధన్ పట్టణంలో..

పట్టణంలోని రెస్టారెంట్లు, ఫాస్ట్​ఫుడ్​ సెంటర్లలో జిల్లా ఫుడ్​ సేఫ్టీ అధికారిణి నవిత నిర్వహించిన దాడుల్లో నిషేధిత సింథటిక్ ఆహార రంగులు (Public Health), టెస్టింగ్ సాల్ట్ వినియోగిస్తున్నట్టు గుర్తించారు. అలాగే రిఫ్రిజిరేటర్లలో రోజులుగా నిర్వహించిన ఆహార పదార్థాలను కూడా వారు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సంబంధిత హోటళ్ల నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. ఆహార భద్రత, ప్రమాణాల చట్టం 2006 ప్రకారం నిబంధనలు ఉల్లంగించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆహార భద్రత నియామాలను ప్రతిఒక్క హోటల్​, రెస్టారెంట్​, ఫాస్టఫుడ్​ సెంటర్​ పాటించాల్సి ఉంటుందన్నారు.

food

ఇది కూడా చదవండి: Adluri Challenge | హరీష్ రావుకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ బహిరంగ సవాల్

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *