Fake Documents | ఫేక్​ డాక్యుమెంట్లు సృష్టించి.. స్థలం కాజేసేందుకు ప్రయత్నించి..

నిజామాబాద్​ నగరంలో అక్రమార్కులకు అడ్డుఅదుపు లేకుండా పోతోంది. తాజాగా కొందరు వ్యక్తులు ఫేక్​ డాక్యుమెంట్లు సృష్టించి ఓ స్థలాన్ని కాజేసేందుకు యత్నించి దొరికిపోయారు.

Balla Sandeep Kumar

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Fake Documents | నిజామాబాద్​ నగరంలో అక్రమార్కులకు అడ్డుఅదుపు లేకుండా పోతోంది. తాజాగా కొందరు వ్యక్తులు ఫేక్​ డాక్యుమెంట్లు సృష్టించి ఓ స్థలాన్ని కాజేసేందుకు యత్నించి దొరికిపోయారు. వివరాల్లోకి వెళ్తే.. నగరంలోని త్రి టౌన్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో నివాసం ఉండే ఓ మహిళ భర్త గతంలో మరణించాడు. అయితే అతని పేరిట చంద్రశేఖర్​ కాలనీ సమీపంలో 50 గజాల స్థలం ఉంది. ఇది ఆమె భర్త పేరిట ఉంది. స్థలం ఖాళీగా ఉండడంతో కొందరు కేటుగాళ్లు కన్నేశారు. దానిని కొట్టేసేందుకు ఫేక్​ డాక్యుమెంట్లు సృష్టించారు.

Fake Documents | ఫేక్​ డాక్యుమెంట్లు తయారు చేసి..

ఖాళీ స్థలంపై కన్నేసిన ఇర్ఫాన్​, సలీం, శివ అనే వ్యక్తులు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారు. డాక్యుమెంట్​ రైటర్​ శ్రీనివాస్​ అనే వ్యక్తితో మహిళ భర్త పేరిట ఉన్న స్థలంపై ఇతరుల పేరిట నకిలీ డాక్యుమెంట్లు తయారు చేయించారు. అనంతరం దానిని ఇతరుల పేరిట మార్చారు. అయితే విషయం తెలుసుకున్న బాధితురాలు మూడో టౌన్​ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీపీ ఆదేశాల మేరకు, ఏసీపీ చొరవతో టౌన్​ సీఐ శ్రీనివాస్​ రాజ్​, మూడో టౌన్​ ఎస్సై హరిబాబు విచారణ చేపట్టి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో పోలీసులు మరింత లోతైన విచారణ చేపడుతున్నారు.

ఇది కూడా చదవండి..: Tahsildar Suspension | అసైన్డ్​​ భూముల రిజిస్ట్రేషన్​.. తహశీల్దార్​పై వేటు

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *