Congress disciplinary committee | పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటా..: గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

కామారెడ్డి సీనియర్​ నాయకుడు, టీపీసీసీ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మరోసారి క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరయ్యారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Congress disciplinary committee | కామారెడ్డి కాంగ్రెస్ (kamareddy congress) పార్టీలో వరుస వివాదాలపై క్రమశిక్షణ కమిటీ విచారణ ప్రారంభించింది. ఇదివరకే టీపీసీసీ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డికి కమిటీ ఛైర్మన్​ షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే.

Congress disciplinary committee | ఛైర్మన్​ లేకపోవడంతో..

ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి (shabbir ali) సైతం వైరల్ అయిన ఆడియోపై వివరణ ఇవ్వాలని లేఖలో కోరగా ఆయన కూడా కమిటీకి లిఖిత పూర్వకంగా వివరంగా ఇచ్చారు. తాజాగా గురువారం మరోసారి కమిటీ విచారణ చేపట్టింది. ఈ విచారణకు గడ్డం చంద్రశేఖర్ రెడ్డితో పాటు ఆయన సతీమణి, కామారెడ్డి మాజీ మున్సిపల్ ఛైర్​పర్సన్​ గడ్డం ఇందుప్రియ(Indu Priya) హాజరయ్యారు. కమిటీ ఛైర్మన్ మల్లు రవికి పలు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. ఇటీవల కమిటీకి వివరణ ఇచ్చానని, ఆరోజు ఛైర్మన్ అందుబాటులో లేకపోవడంతో మరోసారి వచ్చి వివరణ ఇవ్వడం జరిగిందన్నారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు. పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు.

kamareddy 4

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *