అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Rajya Sabha Election | రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మరోషాక్ తగిలింది. ఇటీవల మధ్య ప్రదేశ్‌లో ఆ పార్టీ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురి కావడంతో బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. తాజాగా జార్ఖండ్ (Jharkand)లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోయారు.
జార్ఖండ్‌లో బీజేపీ (BJP) మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన పరిమల్ నత్వాని (Parimal Natwani) 28 ఓట్లతో విజయం సాధించారు. ఆయనకు మొత్తం 30 ఓట్లు రాగా.. అందులో రెండు ఓట్లు చెల్లనివిగా ప్రకటించారు. దీంతో 28 ఓట్లు వచ్చాయి. అయితే రాజ్యసభ సీటు కోసం ఇన్నే ఓట్లు అవసరం కావడంతో ఆయన విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్ ఝా కేవలం 20 ఓట్లు మాత్రమే పొందారని బీజేపీకి చెందిన జార్ఖండ్ లోక్‌సభ ఎంపీ నిషికాంత్ దూబే పేర్కొన్నారు. ఈ ఫలితం ‘మహాఘట్‌బంధన్’ (ఇండియా కూటమి)కు పెద్ద ఎదురుదెబ్బ అని ఆయన అభివర్ణించారు.
Rajya Sabha Election | రెండు స్థానాలకు ఓటింగ్
జార్ఖండ్ అసెంబ్లీలో మొత్తం 81 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు 24 మంది ఎమ్మెల్యేల బలం ఉండగా.. రాజ్యసభ సీటు దక్కించుకోవడానికి 28 తొలి ప్రాధాన్యత ఓట్లకు అవసరం కాగా బీజేపీకి నాలుగు ఓట్లు తక్కువగా ఉన్నాయి. జేఎంఎం, కాంగ్రెస్, వాటి మిత్రపక్షాలతో కూడిన అధికార భారత కూటమికి సభలో 56 మంది సభ్యులు ఉన్నారు. రెండు స్థానాలకు ఓటింగ్ జరగ్గా బీజేపీ మద్దతు ఉన్న స్వతంత్ర అభ్యర్థి పరిమల్ నాథ్వానీ, జేఎంఎం అభ్యర్థి వైద్యనాథ్ రామ్, కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్ ఝా పోటీలో నిలిచారు.
Rajya Sabha Election | క్రాస్ ఓటింగ్

కాంగ్రెస్, జేఎంఎం అభ్యర్థులు గెలవడానికి స్పష్టమైన మెజారిటీ ఉంది. బీజేపీ మద్దతుగల నత్వానికి నాలుగు ఓట్లు తక్కువగా ఉన్నాయి. అయితే ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగింది. దీంతో ఆయన విజయం సాధించారు. కాంగ్రెస్, జేఎంఎం కూటమికి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు నత్వానికి అనుకూలంగా ఓటు వేయడం గమనార్హం. దీంతో ఆయన విజయం సాధించారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోయారు. మరో సీటు జేఎంఎంకు చెందిన బైద్యనాథ్ రామ్‌కు దక్కింది.
దీనిని కూడా చదవండి : TGSPDCL Bribery Case | లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన అసిస్టెంట్ ఇంజనీర్