అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Tahsildar Suspension | నిజామాబాద్ (Nizamabad) జిల్లా నందిపేట తహశీల్దార్ సంతోష్‌రెడ్డి నిబంధనలకు విరుద్ధంగా అసైన్డ్ భూములను రిజిస్ట్రేషన్ చేశారు. దీనిపై విచారన చేపట్టిన కలెక్టర్ తహశీల్దార్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Tahsildar Suspension | విచారణ అనంతరం
నందిపేట (Nandipet) మండలంలోని పలు గ్రామాల్లో అసైన్డ్ భూములు ఉన్నాయి. అయితే ఆస్తి బదలాయింపు పెండింగ్‌లో పలు దరఖాస్తులు ఉన్నాయి. వాటి లబ్ధిదారులతో తహశీల్దార్ మాట్లాడుకొని అక్రమంగా పట్టా చేసినట్లు సమాచారం. ఈ మేరకు కలెక్టర్‌కు ఫిర్యాదులు అందాయి. దీంతో ఆమె విచారణకు ఆదేశించారు. ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ విచారణ చేసి కలెక్టర్‌కు నివేదిక అందించారు. ఆ నివేదిక ఆధారంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి (Ila Tripati) నందిపేట తహశీల్దార్ సంతోష్ రెడ్డిని సస్పెండ్ చేశారు.
దీనిని కూడా చదవండి : Leopard Killing Arrest | చిరుతను హతమార్చిన ఇద్దరి అరెస్ట్: సీపీ సాయిచైతన్య