Leopard Killing Arrest | చిరుతను హతమార్చిన ఇద్దరి అరెస్ట్​: సీపీ సాయిచైతన్య

చిరుతను హతమార్చిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Leopard Killing Arrest | చిరుతను హతమార్చిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు సీపీ సాయిచైతన్య(CP Sai Chaitanya) పేర్కొన్నారు. ఈ మేరకు సీపీ కార్యాలయంలో గురువారం విలేకరులతో మాట్లాడారు.

Leopard Killing Arrest | భీమ్​గల్​ మండలంలో..

సీపీ తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని ఆర్మూర్(Armoor) డివిజన్ పరిధిలోని భీమ్​గల్​ మండలం, కారేపల్లి రేంజ్​లో ఒక చిరుతపులిని కొందరు వ్యక్తులు హతమార్చినట్లు అటవీశాఖాధికారులకు (Forest Department) సమాచారం అందింది. దీంతో కమ్మర్​పల్లి రేంజ్ అధికారి అనిత, సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. అనంతరం తమ విచారణలో భీమ్​గల్​ మండలం తాళ్లపల్లి గ్రామానికి చెందిన మలావత్ సంజీవ్, దేవక్క పేట గ్రామానికి చెందిన సిరిసిల్ల రాములులను అదుపులోకి తీసుకుని విచారించగా..వారు ఒక చిరుత పులిని హతమార్చినట్లు ఒప్పుకున్నారు. కారేపల్లి దక్షిణ బీట్ పరిధిలోని 79 కంపార్ట్​మెంట్​లో హతమార్చిన చిరుత పులి కళేబరాన్ని దాచినట్లు వారు తెలిపారు. దీంతో అటవీశాఖాధికారులు ఆ ప్రాంతం నుంచి చిరుత కళేబరాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Leopard Killing Arrest | అత్యాశకు పోయి.. కటకటాల వెనక్కి..

భీమ్​గల్​ మండలం తాళ్లపల్లి గ్రామానికి చెందిన మాలావత్ సంజీవ్ మేకల కాపరి. ఒక నెల రోజుల క్రితం మేకల మందను కారేపల్లి అటవీ ప్రాంతంలో మేపడానికి వెళ్లగా ఒక ఆడమేకను చిరుత పులి హతమార్చింది. ఈ విషయాన్ని తన గ్రామంలోని ఇతర వ్యక్తులకు తెలియజేశాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న దేవక్క పేట గ్రామానికి చెందిన సిరిసిల్ల రాములు సంజీవ్​ను కలిశాడు. చిరుత పులి తిరిగి ఆ కళేబరం దగ్గరికి వస్తుందని, దాన్ని చంపి దాని శరీర భాగాలను అమ్ముకుంటే రూ.లక్షల్లో డబ్బు వస్తుందని మాలావత్ సంజీవ్​కు ఆశ చూపినాడు. ఆ రాత్రి మలావత్ సంజీవ్ తన గ్రామానికి చెందిన  నలుగురు వ్యక్తులతో కలిసి ఆ కళేబరంలోకి గడ్డి మందును సిరంజ్​ ద్వారా ఎక్కించారు.

Leopard Killing Arrest | సరైన కొనుగోలుదారుడి కోసం..

మరుసటి రోజు ఉదయం ఆ ప్రాంతానికి నిందితులు వెళ్లి చూడగా చిరుత పులి చనిపోయి ఉంది. ఈ విషయాన్ని మలావత్ సంజీవ్ సిరిసిల్ల రాములు, ఇతర నలుగురు వ్యక్తులకు తెలిపాడు. వారు అక్కడికి వచ్చిన తర్వాత ఆ చిరుత కళేబరాన్ని దాచిపెట్టి సరైన కొనుగోలుదారుడు దొరికిన తర్వాత దానిని తీసి అమ్ముకుందామని నిర్ణయించుకున్నారు. చిరుత కళేబరాన్ని గుర్తించిన తర్వాత అటవీశాఖ అధికారులు విచారించగా ఈ వివరాలను సంజీవ్​ తెలిపారు. విచారణలో భాగంగా సిరిసిల్ల రాములు ఇంట్లో తనిఖీ చేయగా ఒక నాటు తుపాకీ దొరికింది. దానిని అటవీశాఖ అధికారులు తదుపరి విచారణ కొరకై భీమ్​గల్​ పోలీసులకు అప్పగించారు. వీరికి సహకరించిన మిగితా నలుగురు పరారీలో ఉన్నట్లు సీపీ తెలిపారు. వీరిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం 2022, తెలంగాణ అటవీ చట్టం, జీవవైవిద్య చట్టం ప్రకారం కేసులు నమోదు చేయడం జరిగిందని..నిందితులను ఆర్మూర్​ న్యాయస్థానంలో హాజరు పర్చామని వివరించారు.

police 8

ఇది కూడా చదవండి: నాచారం చెరువు అభివృద్ధికి శ్రీ‌కారం.. 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *