అక్షరటుడే, ఆర్మూర్ : Jagannath Rath Yatra | ఆర్మూర్(Armoor) ఇస్కాన్ (ISKCON Armoor) ఆధ్వర్యంలో గురువారం జగన్నాథ రథయాత్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి (Mla Rakesh reddy), మున్సిపల్ ఛైర్ పర్సన్ గోనె లహరి, బీజేపీ సీనియర్ నాయకులు పెద్దోళ్ల గంగారెడ్డి యాత్రను ప్రారంభించారు.
Jagannath Rath Yatra |పెర్కిట్ హనుమాన్ ఆలయం నుంచి..
ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ హనుమాన్ ఆలయం నుంచి ప్రారంభమైన ఈ రథయాత్ర పెర్కిట్ చౌరస్తా, మామిడిపల్లి చౌరస్తా, కొత్త బస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా, పాత బస్టాండ్ మీదుగా అంగడి బజార్లోని బాలాజీ ఫంక్షన్ హాల్ వరకు చేపట్టారు. అనంతరం పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు అన్నదానం చేశారు.