Bheemgal Political Dispute | ప్రజల్లో ఉనికి కోసమే ఎమ్మెల్యే ప్రశాంత్​రెడ్డి దీక్షలు: నగేష్​ రెడ్డి

ప్రజల్లో తన ఉనికిని కాపాడుకోవడానికి ప్రశాంత్ రెడ్డి నిరాహార దీక్ష చేశాడని డీసీసీ అధ్యక్షుడు నగేష్​ రెడ్డి ఆరోపించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Bheemgal Political Dispute | ప్రజల్లో తన ఉనికిని కాపాడుకోవడానికి ప్రశాంత్ రెడ్డి (Mla Prashanth Reddy) నిరాహార దీక్ష చేశాడని డీసీసీ అధ్యక్షుడు నగేష్​ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు నగరంలోని డీసీసీ కార్యాలయంలో(DCC Nizamabad) విలేకరుల సమావేశం నిర్వహించారు.

Bheemgal Political Dispute | భీమ్​గల్​ పట్టణంలో..

2022 జూన్ 2న భీమ్​గల్​ పట్టణంలో బీఆర్​ఎస్​ హయాంలో రూ.35 కోట్లతో 100 పడకల ఆస్పత్రికి ఫౌండేషన్ వేసినప్పుడు మూడు నెలల్లో నిర్మిస్తామని చెప్పి 18 మాసాలు నత్త నడకన సాగించి చివరకు రూ.17 కోట్ల పనులు మాత్రమే చేశారని నగేష్​ రెడ్డి అన్నారు. సుమారు రూ.6 కోట్ల చేపల మార్కెట్ కొరకు మంజూరు చేసుకొని 18 నెలల్లో 1.5 కోట్ల పనులు మాత్రమే చేశారని వివరించారు. పురాతన కట్టడంగా ఉన్న తహశీల్దార్​ కార్యాలయాన్ని కూలగొట్టి ప్రజలకు అందుబాటులో లేకుండా 2 కిలోమీటర్ల దూరంలో ఎస్టీ హాస్టల్​లోకి మార్చారన్నారు. రోడ్ నిర్మాణం కోసం రూ.25 కోట్లు మంజూరు చేసుకొని అక్కడ రూ.17 కోట్ల వరకే పనులు చేశారని ధ్వజమెత్తారు.. దానికి మహేష్ కుమార్ గౌడ్ రూ.3 కోట్లు నిధులు ఇప్పించారని తెలిపారు. మరో నాలుగున్నర కోట్ల పనులు పూర్తయ్యాయని వాటికి బిల్లులు ఇప్పిస్తామని చెప్పామన్నారు.

Bheemgal Political Dispute | సచివాలయం పనులు ఎలా పూర్తయ్యాయి..

అదే సమయంలో హైదరాబాద్​లో సచివాలయం కోసం రూ.500 కోట్లు అంచనా పెట్టుకొని ప్రశాంత్​రెడ్డి ఆధ్వర్యంలో మరో రూ.500 కోట్లు అదనంగా మంజూరు చేసుకొని తొమ్మిది నెల్లలో దానిని పూర్తి చేశారని నగేష్​ రెడ్డి అన్నారు. మరి అదే సమయంలో బాల్కొండ నియోజకవర్గంలో జరిగే పనులను ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. అక్కడ రూ.1000 కోట్లతో పనులను 9 నెలల్లో  పూర్తి చేసిన ప్రశాంత్​రెడ్డి బాల్కొండలో రూ.50 కోట్లతో 18 నెలల్లో పనులు పూర్తి చేయాలనే చిత్తశుద్ధి లేదా అని ప్రశ్నించారు. ఆయన హయాంలో పనులను మంజూరు చేసుకుని వాటిని ఆలస్యం చేసి ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడిపై అభండాలు వేయడం సరికాదన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో సుమారు 75శాతం తాము గెలుచుకున్నామని.. భీమ్​గల్​ మున్సిపల్ ఎన్నికల్లో ప్రశాంత్​రెడ్డిని చిత్తుచిత్తుగా ఓడించి ఆ స్థానాన్ని మేము కైవసం చేసుకున్నామని వివరించారు. మేము ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సునీల్ రెడ్డి సారథ్యంలో పూర్తి చేస్తున్నామని.. మున్సిపల్​లో 8 స్థానాలను గెలుచుకొని మున్సిపల్ ఛైర్మన్​స్థానాన్ని కైవసం చేసుకున్నామని స్పష్టం చేశారు.

Bheemgal Political Dispute | మున్సిపల్​ ఎన్నికల్లో..

మున్సిపల్ ఎన్నికల్లో ఇచిన హామీలు నెరవేరుస్తున్నామని నగేష్​ రెడ్డి పేర్కొన్నారు. లింబాద్రి గుట్టకు ప్రభుత్వం రూ.4 కోట్లు మంజూరు చేసిందని,  ​గల్​ పట్టణానికి అదనంగా రూ.15 కోట్లు ఇచ్చామన్నారు. కాంగ్రెస్​ చేస్తున్న సంక్షేమం చూసి ఓర్వలేక ప్రశాంత్ రెడ్డి దొంగ దీక్ష చేశారన్నారు. రాబోయే రోజుల్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కే ప్రజలు పట్టం కడతారని నగేష్​ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు రత్నాకర్ గౌడ్, గాదరి గోపి, కోశాధికారి భక్తవత్సలం, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు యాదగిరి, జావీద్ అక్రం, స్పోక్స్ పర్సన్ లింగన్న, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్ గౌడ్, బీసీ సెల్ అధ్యక్షుడు నరేందర్ గౌడ్, బాల నర్సయ్య, రవి, గణేష్, పూర్ణ చందర్, కిష్టా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Congress

ఇది కూడా చదవండి: #KaalanneThiragesi Musical Video from #Sahaa Out

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *