Armoor Cordon Search | ఆర్మూర్​లో కార్డన్​ సెర్చ్​.. పలు వాహనాలు స్వాధీనం

ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని నల్ల పోచమ్మ గల్లీలో ఆదివారం పోలీసులు కార్డన్​ సెర్చ్​ నిర్వహించారు. ఎస్​హెచ్​వో సత్యనారాయణ గౌడ్​ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ఆర్మూర్ : Armoor Cordon Search | ఆర్మూర్(Armoor) మున్సిపల్ పరిధిలోని నల్ల పోచమ్మ గల్లీలో ఆదివారం పోలీసులు కార్డన్​ సెర్చ్​ నిర్వహించారు. ఎస్​హెచ్​వో సత్యనారాయణ గౌడ్​ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

Armoor Cordon Search | ఇంటింటికీ తిరుగుతూ..

ఎస్​హెచ్​వో ఆధ్వర్యంలో పోలీసు బృందం ఇంటింటికీ తిరుగుతూ ప్రజలు వివరాలు సేకరించారు. అనుమానిత వ్యక్తుల గురించి ఆరా తీశారు. వారి ఆధార్​ కార్డులను ఇతరత్రా వివరాలను పరిశీలించారు. ఎన్నాళ్లుగా ఆ ప్రాంతంలో ఉంటున్నారు.. చేస్తున్న పనుల వివరాలను నమోదు చేసుకున్నారు.

Armoor Cordon Search | 50కి పైగా వాహనాలు స్వాధీనం

సెర్చ్​లో భాగంగా సరైన ధ్రువపత్రాలు లేని 50 బైక్​లను, మూడు ఆటోలను సీజ్(Vehicle Seizure,) ​చేశారు. అనంతరం ఎస్​హెచ్​వో మాట్లాడుతూ.. ప్రతి వాహనానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను వెంట ఉంచుకోవాలని సూచించారు. కాలనీల్లో ఎవరైనా అనుమానిత వ్యక్తులు సంచరిస్తే వెంటనే 100కు లేదా స్థానిక పోలీస్​స్టేషన్​కు సమాచారం అందించాలని సూచించారు. ప్రతి ఇంటికి తప్పనిసరిగా సీసీ కెమెరాలు అమర్చుకుంటే నేరాల కట్టడికి అవకాశం ఉంటుందని తెలియజేశారు.

cordon

ఇది కూడా చదవండి: జైసల్మేర్‌లోని అటవీ ప్రాంతంలో భారీగా మంటలు చెలరేగాయి. వీటిని అదుపు చేసేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *