Caste Census Demand | జనగణనలో కులగణనను తప్పనిసరి చేసి యూనిక్ కోడ్ కేటాయించాలి

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Caste Census Demand | జనగణనలో కులగణనను తప్పనిసరి చేస్తూ ప్రతి కులానికి యూనిక్ కోడ్ కేటాయించాలని బీసీ నాయకులు డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా (Kamareddy District) కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద గల మహాత్మా జ్యోతిబా పూలే ప్రాంగణంలో బీసీల ధర్మ పోరాట దీక్ష చేపట్టారు.

Caste Census Demand | బీసీ సంఘాల నాయకులు

బీసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా జరిగే జాతీయ జనగణనలో బీసీ కులగణన చేపడతామని కేంద్రం ప్రకటించిందని, కానీ ఇప్పుడు శాస్త్రీయ పద్ధతిలో కాకుండా ఓబీసీ కాలమ్ లేకుండా జనగణన ప్రారంభిస్తున్నారని ఆరోపించారు. శాస్త్రీయంగా లెక్కించకపోతే వేల కోట్ల ప్రజాధనం వృథా అవుతుందని, పారదర్శకంగా ప్రతి కులాన్ని నమోదు చేయాలని అన్నారు. కొందరు బీసీ వ్యతిరేకులు కులగణనను తప్పుదారి పట్టించేందుకే రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమం చేస్తున్నారని, వారంతా దేశద్రోహులేనని విమర్శించారు.

కేంద్రం స్పందించి కులగణన చేర్చకుంటే పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం దీక్షకు సంఘీభావంగా మున్సిపల్ ఛైర్​పర్సన్ ఇప్ప ఉమారాణి, వైస్ ఛైర్​పర్సన్ కాసర్ల గోదావరి స్వామి, కో-ఆప్షన్ సభ్యుడు కుంబాల రవి, కౌన్సిలర్లు హాజరై మద్దతు తెలిపి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. అలాగే తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు తాహెర్ మహమ్మద్ సైతం దీక్షకు మద్దతిచ్చారు. ఈ కార్యక్రమంలో బాజ లలిత, క్యాతం సిద్ధరాములు, గణేష్ నాయక్, తాహెర్, కొత్తపల్లి మల్లన్న, ఒడ్డె ఎల్లయ్య, చాకలి రాజయ్య, వెంకటస్వామి, విఠల్, రమేష్, ప్రవీణ్, హజీజ్ పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Private Tender Protest | ప్రైవేటీకరణ టెండర్లకు వ్యతిరేకంగా పోచంపాడ్ జెన్‌కో కార్యాలయంలో నిరసన

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *