అక్షరటుడే, ఎల్లారెడ్డి: RTC Bus Accident | ఆర్టీసీ(TGSRTC) బస్సు బోల్తా పడి డ్రైవర్ మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన బిచ్కుంద (Bichkunda) సమీపంలో శుక్రవారం చోటు చేసుకుంది.
RTC Bus Accident | సైడ్వాల్ను ఢీకొని..
హైదరాబాద్ డిపో–1కు చెందిన ఎక్స్‌ప్రెస్ బస్సు హైదరాబాద్ నుంచి బిచ్కుంద వెళ్తుండగా జుక్కల్ ఎక్స్‌రోడ్ దాటి బిచ్కుంద సమీపంలో సైడ్వాల్ను ఢీకొట్టి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ ఆంజనేయులు బస్సు కింద ఇరుక్కుని అక్కడికక్కడే మృతి చెందాడు. పలువురికి గాయాలయ్యాయి. ప్రమాదం సమయంలో బస్సులో 13మంది ప్రయాణికులు ఉన్నారు. క్షతగాత్రులను బిచ్కుంద ఆస్పత్రికి తరలించారు.
RTC Bus Accident | మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్భ్రాంతి
బస్సు ప్రమాదంలో ఆర్టీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. బస్సు ప్రమాదంలో డ్రైవర్ మృతి చెందడం తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రమాద ఘటనపై ఆర్టీసీ ఎండీ, కలెక్టర్, ఎస్పీలతో ఫోన్‌లో మాట్లాడి ప్రమాదానికి గల కారణాలు, ప్రస్తుతం పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు. మృతుడి కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆర్‌ఎం నేతృత్వంలో అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించాలని, బాధితులకు అండగా నిలవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు.
ఇది కూడా చదవండి: Telangana Congress BC Politics | క్రమశిక్షణ పేరిట వర్గ సమరం.. తెలంగాణ కాంగ్రెస్‌లో భిన్న తీరు.. కొండా బర్తరఫ్‌పై బీసీ వర్గాల నిరసన