Konda Surekha | త్వరలో కీలక నిర్ణయం.. కొండా సురేఖ ప్రకటన

మాజీ మంత్రి కొండా సురేఖ కీలక ప్రకటన చేశారు. నిరీక్షణ ముగిసింది.. త్వరలో కీలక నిర్ణయాన్ని ప్రకటిస్తా అని ఆమె పేర్కొన్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Konda Surekha | మాజీ మంత్రి కొండా సురేఖ కీలక ప్రకటన చేశారు. నిరీక్షణ ముగిసింది.. త్వరలో కీలక నిర్ణయాన్ని ప్రకటిస్తా అని ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్​ మీడియాలో పోస్ట్​ చేశారు.

కొండా సురేఖను గురువారం మంత్రి పదవి నుంచి బర్తరఫ్​ చేసిన విషయం తెలిసిందే. ఆమెను తొలగించడంతో పాటు ఆ శాఖలను సీఎంకు కేటాయించారు. తన తొలగింపుపై ఇప్పటికే ఆమె స్పందించారు. అన్యాయంగా పదవి నుంచి తప్పించారని, తన వివరణ తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తాజాగా సోషల్​ మీడియా (Social Media) వేదికగా.. నిరీక్షణ ముగిసిందని ప్రకటించడం గమనార్హం.

Konda Surekha | పార్టీ మారుతారా..

కొండా సురేఖ తన బర్తరఫ్​ అనంతరం మాట్లాడుతూ.. తాను ఎక్కడికి వెళ్లడం లేదని కాంగ్రెస్​లోనే ఉంటానని స్పష్టం చేశారు. అయితే తాజాగా త్వరలో కీలక నిర్ణయం వెల్లడిస్తానని ప్రకటించడం వెనుక ఆంతర్యం ఏమిటని పలువురు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఆమె కాంగ్రెస్​ను వీడి ఇతర పార్టీలో చేరుతారా అనే చర్చ జరుగుతోంది. బీజేపీలో చేరుతారని గతంలో ప్రచారం జరిగినా.. ఆమె స్పందించలేదు. ఆమె కాంగ్రెస్​కు రాజీనామా చేసి బీఆర్​ఎస్​ లేదా బీజేపీలోకి వెళ్తారా అనేది చూడాల్సి ఉంది.

Konda Surekha | పదవికి రాజీనామా చేయాలి

కొండా సురేఖ ఒక వేళ పార్టీ మారితే తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆమెను పార్టీ నుంచి సస్పెండ్​ చేయలేదు. దీంతో ఇతర పార్టీలోకి చేరితే వేటు వేసే అవకాశం ఉంది. అలా చేయకుండా ఆమె రాజీనామా చేసి.. పార్టీ మారితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అయితే ఎమ్మెల్యేగా ఆమె పదవి కాలం రెండేళ్లకు పైగా ఉంది. ఈ సమయంలో రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్తే ఎలా అని ఆమె ఆలోచిస్తున్నట్లు సమాచారం.

Konda Surekha | గెలుపు కష్టమే..

ప్రస్తుతం ఉమ్మడి వరంగల్​ జిల్లాలో ఎమ్మెల్యేలు, కీలక నేతలు కొండా కుటుంబానికి దూరం అయ్యారు. పార్టీ, ప్రభుత్వ పదవులు అనుభవిస్తున్న ఆమె అనుచరులు సైతం సైలెంట్​గా ఉన్నారు. ఏమైనా మాట్లాడితే తమ పదవులు పోతాయేమోనని ఆందోళన చెందుతున్నారు. ఈ సమయంలో ఆమె రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్తే గెలవడం కష్టమనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ క్రమంలో ఆమె ఏం నిర్ణయం తీసుకుంటారనేది త్వరలో తెలియనుంది.

ఇది కూడా చదవండి..: Gig workers Telangana | గిగ్​వర్కర్ల సమస్యలు పరిష్కరిస్తాం : మంత్రి పొన్నం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *