అక్షరటుడే, వెబ్‌డెస్క్: Weather Update | తెలంగాణ (Telangana)లోని పలు జిల్లాల్లో సోమవారం మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు అక్కడక్కడ వాన దంచి కొట్టింది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలోని సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు జల్లులు కురుస్తాయి. సాయంత్రం వరకు వాతావరణం పొడిగా ఉటుంది. సాయంత్రం నుంచి రాత్రి వరకు జల్లులు పడే ఛాన్స్ ఉంది. మిగతా జిల్లాల్లో చెదురుమొదురు వానలు పడతాయి. హైదరాబాద్ నగరంలో అక్కడక్కడ చిరుజల్లులు కురుస్తాయి.
Weather Update | అన్నదాతల హర్షం
రాష్ట్రంలో గత 15 రోజులుగా కురుస్తున్న వానలతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు పడవని అధికారులు మొదట్లో చెప్పారు. వారి చెప్పినట్లే జులై 20 వరకు వానలు లేకపోవడంతో పంటలు సాగు చేయడానికి అన్నదాతలు ఆలోచించారు. వేసిన పంటలు ఎండుముఖం పట్టాయి. భూగర్భ జలాలు తగ్గిపోయాయి. ఈ సమయంలో వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో వరినాట్లు పూర్తయ్యాయి. ఈ వర్షాలతో వానాకాలం పంటలకు ఢోకా లేకుండా పోయిందని రైతులు పేర్కొంటున్నారు.
Weather Update | జలకళ
వర్షాలు లేక 20 రోజుల క్రితం తెలంగాణలోని ప్రాజెక్టులు డెడ్ స్టోరేజీకి చేరుకున్నాయి. చెరువులు అడుగంటాయి. అయితే ఇటీవల కురుస్తున్న వర్షాలతో చెరువులు, జలాశయాలకు జలకళ వచ్చింది. చెరువులు నిండుకుండలా మారాయి. జలాశయాలకు వరద వస్తోంది. గోదావరిపై గల శ్రీరాం సాగర్ 40 టీఎంసీలకు చేరగా.. ఎల్లంపల్లి నిండింది. చిన్న, మధ్య తరహా ప్రాజెక్టులు నిండాయి. మరోవైపు కృష్ణానదిపై గల జూరాల నిండగా.. శ్రీశైలం త్వరలో నిండనుంది.
ఇది కూడా చదవండి..: Nagarjuna Sagar Varuna Yagam | నాగార్జునసాగర్‌లో సోమవారం వరుణయాగం..పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం రేవంత్