అక్షరటుడే, వెబ్‌డెస్క్: Rythu Bharosa Funds | వానాకాలం సీజన్‌కు సంబంధించిన రైతు భరోసా నిధులను సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) మంగళవారం విడుదల చేయనున్నారు. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.
ఎకరానికి రూ.6 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. విడతల వారిగా నిధులు జమ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. తొలి విడతలో మంగళవారం రెండు ఎకరాల వరకు ఉన్న 41.37 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2,482.02 కోట్లు జమ చేయనున్నారు. మొత్తం 73.32 లక్షల మందికి రూ.9 వేల కోట్లు దశలవారీగా విడుదల చేయనున్నారు. 9 రోజుల్లో రైతు భరోసా నిధులు అందరి రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Rythu Bharosa Funds | ట్రాఫిక్ ఆంక్షలు
హైటెక్ సిటీలోని శిల్పకళా వేదికలో రేవంత్ రెడ్డి మీటింగ్ సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. 5000 మంది రైతులతో సాయంత్రం రైతు బంధు నిధుల విడుదల కార్యక్రమం నిర్వహించనున్నారు. దీంతో ఆ మార్గంలో ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉంటుందని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు. ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. కేబుల్ బ్రిడ్జి–ఐకియా– శిల్ప కళావేదిక– శిల్పారామం– మెటల్ చార్మినార్ జంక్షన్ మార్గంలో ట్రాఫిక్ రద్దీ ఉంటుందని పేర్కొన్నారు. వాహనదారులు ఇతర మార్గాల్లో తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇది కూడా చదవండి..: Telangana Weather Update | నేడు పలు జిల్లాలకు భారీ వర్ష సూచన