Telangana Weather Update | నేడు పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళవారం అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Telangana Weather Update | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళవారం అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అల్పపీడన ప్రభావంతో జులై 2 నుంచి భారీ గాలులు వీస్తాయని పేర్కొన్నారు.

తెలంగాణ (Telangana)లోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయి. ఇతర జిల్లాల్లో చెదురుమొదురు వానలు కురుస్తాయి.

Telangana Weather Update | అల్పపీడనం

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాబోయే 5-6 రోజుల్లో.. ముఖ్యంగా జూలై 2 నుంచి 5 వరకు ఉదయం, మధ్యాహ్న వేళల్లో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. ఈ సమయంలో గాలుల వేగం గంటకు 50-60 కిలోమీటర్ల వరకు ఉండవచ్చు. ఈ అల్పపీడనం కారణంగా కొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, అలాగే మిగిలిన తెలంగాణ ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్​ ఉంది.

Telangana Weather Update | ముఖం చాటేసిన వరుణుడు

వానాకాలం సీజన్​ ప్రారంభమై నెల అవుతోంది. అయినా ఇప్పటి వరకు ఒక్క భారీ వర్షం కురువలేదు. అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడ్డా.. కాలువలు పారేలా వాన కురువలేదు. ఎల్​నినో ప్రభావంతో లోటు వర్షపాతం నమోదైందని అధికారులు చెబుతున్నారు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పలువురు రైతులు బోరుబావుల కింద వరినాట్లు ప్రారంభించారు. మిగిలిన రైతులు ఆకాశం వరుణుడి కరుణ కోసం చూస్తున్నారు.

Telangana Weather Update | తగ్గిన భూగర్భ జలాలు

Telangana Weather Update

వర్షాలు లేకపోవడంతో భూగర్భ జలాలు తగ్గాయి. సాగుకోసం రైతులు బోర్లను నిరంతరం నడిపిస్తుండటంతో రోజు రోజుకు భూగర్భ జలాలు లోతుకు పోతున్నాయి. దీంతో బోరుబావులు గ్యాప్​ ఇస్తున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. మరోవైపు ప్రాజెక్టులు, చెరువులు సైతం ఖాళీ అయ్యాయి. దీంతో వాటి నుంచి నీరు వదిలే పరిస్థితి లేకపోవడంతో కాలువల కింద కూడా వ్యవసాయ పనులు సాగడం లేదు.

ఇది కూడా చదవండి..: Pawan Kalyan Surgery | పవన్ కళ్యాణ్ భుజాలకు తీవ్ర గాయం.. సర్జరీ సూచించిన వైద్యులు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *