CV Anand DGP | తెలంగాణ నూతన డీజీపీగా సీవీ ఆనంద్‌.. మే 1న బాధ్యతల స్వీకరణ!

shashi kiran Mottala

అక్షరటుడే, హైదరాబాద్: CV Anand DGP | తెలంగాణ నూతన డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్‌ను(CV Anand) నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత డీజీపీ శివధర్‌రెడ్డి(DGP Shivadhar Reddy) ఈ నెల 30న పదవీ విరమణ చేయనుండటంతో, ఆయన స్థానంలో 1991 బ్యాచ్‌కు చెందిన ఆనంద్‌కు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది.

CV Anand DGP | మే 1న బాధ్యతల స్వీకరణ

ప్రస్తుతం హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా(Home Department) బాధ్యతలు నిర్వర్తిస్తున్న సీవీ ఆనంద్‌.. మే 1వ తేదీన రాష్ట్ర పోలీస్ బాస్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. 2028 జూన్ వరకు ఆయన సర్వీస్‌లో ఉండనుండటంతో, దాదాపు రెండేళ్లకు పైగా ఆయన ఈ అత్యున్నత పదవిలో కొనసాగే అవకాశం ఉంది.

CV Anand DGP | పోలీసు శాఖలో సుదీర్ఘ అనుభవం..

సీవీ ఆనంద్‌కు పోలీసు శాఖలో సుదీర్ఘ అనుభవం ఉంది. గతంలో హైదరాబాద్(Hyderabad) పోలీస్ కమిషనర్‌గా ఆయన అద్భుతమైన పనితీరు కనబరిచారు. 1993లో వరంగల్ ఏఎస్పీగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి, నిజామాబాద్ ఎస్పీగా, గ్రేటర్ పరిధిలో వివిధ హోదాల్లో పనిచేశారు. ఆయన సమర్థతను గుర్తించిన ప్రభుత్వం ఈ కీలక బాధ్యతలను కట్టబెట్టింది. సీవీ ఆనంద్ డీజీపీగా వెళ్తుండటంతో, ఆయన స్థానంలో హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐపీఎస్ అధికారిణి శిఖా గోయల్‌ను ప్రభుత్వం నియమించింది.

ఇది కూడా చదవండి: PCB Price Hike | యుద్ధం ఎఫెక్ట్.. 40 శాతం పెరిగిన సర్క్యూట్ బోర్డుల ధరలు!

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *