అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ACB Raid | ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. నిత్యం దాడులు చేస్తూ.. లంచాలు తీసుకుంటున్న అధికారులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ప్రజల్లో సైతం అవగాహన రావడంతో ఇటీవల ఏసీబీ (ACB)కి ఫిర్యాదులు పెరిగాయి. తాజాగా రూ.లక్ష లంచం తీసుకుంటూ ఇద్దరు ఉద్యోగులు ఏసీబీకి చిక్కారు.
హైదరాబాద్‌లోని సచివాలయంలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఆనందేషి రాఘవేందర్, టీఎస్ఐడీసీ (TSIDC) కార్యాలయంలో పని చేసే సీనియర్ అసిస్టెంట్ మేడి వినోద్‌ను ఏసీబీ అధికారులు గురువారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) పథకం కింద ఫిర్యాదిదారుడి వైద్య ఖర్చుల రీయింబర్స్మెంట్ క్లెయిమ్‌లను ప్రాసెస్ చేయడం, మంజూరైన రూ.2 లక్షల మొత్తానికి చెక్కు జారీ చేయడం, మిగిలిన వైద్య ఖర్చుల రీయింబర్స్మెంట్ క్లెయిమ్‌ను ప్రాసెస్ చేయడం కోసం ఇద్దరు లంచం డిమాండ్ చేశారు.
ACB Raid | ఫోన్ పే ద్వారా రూ.5 వేలు
నిందితులు గతంలోనే బాధితుడి నుంచి ఫోన్ పే ద్వారా రూ.5 వేలు లంచం తీసుకున్నారు. మరో రూ.లక్ష ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో అతడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు గురువారం ఫిర్యాదుదారుడి నుంచి లంచం తీసుకుంటుండగా.. అవుట్సోర్సింగ్ ఉద్యోగి రాఘవేందర్, బషీర్‌బాగ్‌లోని పరిశ్రమ భవన్‌లోని TSIDC కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ మేడి వినోద్‌ను వల పన్ని పట్టుకున్నారు. ఇద్దరు ఉద్యోగులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.
దీనిని కూడా చదవండి : Revanth Reddy Countdown | రేవంత్‌రెడ్డికి కౌంట్‌డౌన్ మొదలైంది : హరీశ్‌రావు